26 వేల మంది.. ఒకేసారి ఆ పని చేస్తూ గిన్నిస్ రికార్డ్..!

-

ఈ ఫోటోలో చీమల్లా కనిపిస్తున్నవారంతా ఏం చేస్తున్నారో చూశారా.. గ్రౌండ్ లో సైనికుల్లా పేరేడ్ లో నిలుచున్న వీరంతా ఒకేసారి బ్రష్ చేస్తూ గిన్నిస్ బుక్ రికార్డు సాధించారు. ఒడిశాలోని భువనేశ్వర్ లోని కళింగ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ విశ్వవిద్యాలయ విద్యార్థులు ఈ అరుదైన ఘనత సాధించారు.

ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. వంద మంది కాదు.. ఏకంగా 26 వేల 382 విద్యార్థులు ఒకేసారి పళ్లు తోముకుని గిన్నిస్ రికార్డ్ సాధించారు. అత్యధిక మంది ఒకేసారి బ్రష్ చేసిన కార్యక్రమంగా ఇది గిన్నిస్ రికార్డులకెక్కింది. మరి ఇదంతా ఎందుకు చేశారంటారా.. అందుకూ ఓ కారణం ఉంది.

నోటి ఆరోగ్యంపై అవగాహన కల్పించేందుకు ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ డెంటిస్ట్రీ, కోల్గేట్ పాల్మొలివ్ ప్రైవేట్ లిమిటెడ్ కలిసి ఈ ఈవెంట్ నిర్వహించాయి. అత్యధిక మంది ఒకేచోట ఒకేసారి బ్రష్ చేసిన రికార్డ్ గతంలో దిల్లీ పభ్లిక్ స్కూల్ పేరిట ఉండేది. అప్పట్లో 16 వేల 414 మంది ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు కళింగ విద్యార్థుల చొరవతో ఆ రికార్డ్ బద్దలైంది.

మన దేశంలో నోటి ఆరోగ్యంపై ప్రజలకు అంతగా అవగాహన ఉండటం లేదు. అదో ముఖ్యమైన విషయంగా చాలా మంది భావించడం లేదు. లేచామా.. నోట్లో బ్రష్ పెట్టుకుని అటూ ఇటూ తిరుగుతూ ఏదో పనైపోయిందని కానిచ్చేస్తున్నారు. అందుకే అవగాహన కోసం ఇంత భారీ కార్యక్రమం చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news