గినియా పంది గిన్నిస్ రికార్డ్.. దీని ప్రత్యేకత ఇదే..!?

-

హంగేరీకి చెందిన ఓ గినియా పంది గిన్నిస్ రికార్డు సృష్టించింది. 30 సెకన్లలో అత్యధిక బాస్కెట్ బాల్ స్లామ్ డంక్స్ చేసి రికార్డ్ నెలకొల్పింది. ఈ వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది. మొత్తం నాలుగు స్లామ్ డంక్స్ తో టైటిల్‌ను కైవసం చేసుకుంది. కాగా, ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోను చూసిన ప్రతిఒక్కరూ ఆశ్చర్యానికి లోనవుతున్నారు.

గినియా పిగ్-గిన్నిస్ రికార్డ్

గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో గినియా పిగ్ వీడియోను మనం ఒక్కసారి చూసినట్లయితే.. ఈ వీడియోలో పిగ్ తన నోటితో బంతిని తీసుకెళ్లి బాస్కెట్ బాల్ హోప్‌లో ఉంచుతుంది. అలా ఒక్కొక్క పాయింట్ సాధించిన తర్వాత తిరిగి ఆ బాల్‌ను తన యజమాని రిటర్న్ వేస్తాడు. మళ్లీ పిగ్ ఆ బాల్‌ను బాస్కెట్ బాల్‌లో వేస్తుంది. ఇలా గేమ్ కంటిన్యూ అవుతుంది. అలా 30 సెకన్లలో తన టార్గెట్ ఫినిష్ చేస్తుంది. దీంతో గినియా పిగ్ కొత్త రికార్డు సృష్టించింది. తన పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్‌ లో నమోదు అయింది. కాగా, ఈ వీడియోను పోస్ట్ చేసిన కొద్ది గంటల్లో భారీ వీవ్స్ వచ్చాయి. చాలా మంది నెటిజన్లు వీడియోను చూసి మురిసిపోతున్నారు.

https://www.instagram.com/reel/CeQ2MrZj7B4/?utm_source=ig_embed&ig_rid=c6be11cd-44d5-4df8-89a0-4187d5578c42

Read more RELATED
Recommended to you

Exit mobile version