ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు ఫ్యాన్స్ గుడ్ న్యూస్…ఓజీ నుంచి సాంగ్ వచ్చేసింది

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం “ఓజీ”. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా నుంచి పాటలు, పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేసి మేకర్స్ అంచనాలను భారీగా పెంచేశారు. తాజాగా ఓజీ నుంచి గన్స్ అండ్ రోజెస్ అనే అదిరిపోయే పాటను చిత్ర బృంద సభ్యులు రిలీజ్ చేశారు.

og
Guns N Roses They Call Him OG Pawan Kalyan

ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. కాగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా ప్రియాంక అరుల్ మోహన్ నటిస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ తెలుగులో కొన్ని సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. తనదైన నటన, అందంతో ప్రేక్షకులలో చెరగని ముద్ర వేసుకున్న ఈ చిన్నది ఏకంగా పవన్ కళ్యాణ్ సరసన హీరోయిన్ గా చేసే అవకాశాన్ని కొట్టేసింది. మరి ఈ సినిమాలో తన నటనతో ఈ బ్యూటీ ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news