ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్యులకు సరైన ‘ప్రొటెక్షన్’ కిట్స్ ఇవ్వకుండా ఇబ్బందులపాలు చేస్తుందని వైద్యులు లబోదిబో మంటున్నారు. నర్సీపట్నం కి చెందిన సుధాకర్ అనే మత్తు డాక్టర్ ఇటీవల ఏపీ ప్రభుత్వం పై సంచలన వ్యాఖ్యలు చేసి సస్పెండ్ అయిన సంగతి అందరికీ తెలిసినదే. రాష్ట్ర ప్రభుత్వం వైద్యులకు ‘ప్రొటెక్షన్’ కిట్స్ ఇవ్వకుండా కరోనా వైరస్ రోగులకు చికిత్స చేయిస్తుందని ఇది ప్రమాదకరమని డాక్టర్ సుధాకర్ అన్న వ్యాఖ్యలు మనకందరికీ తెలిసినదే.
అసలు ఎటువంటి వైద్యం చేయాని అధికార పార్టీ నేతలు మాస్కులు ధరించి కుంటూ మీడియా ముందు బాగానే కనబడుతున్నారు, అటువంటిది కొన్ని వేల మంది కరోనా వైరస్ రోగులకు వైద్యం కల్పిస్తున్న వైద్యులకు మాస్కులు కల్పించాలని ఇంగిత జ్ఞానం ప్రభుత్వానికి లేదా అంటూ విమర్శిస్తున్నారు. ఈ విధంగా అడిగినందుకు నర్సీపట్నం డాక్టర్ ని సస్పెండ్ చేశారు, మరి ఈ కొత్త డాక్టర్ నీ ఏం చేస్తావు జగన్ అంటూ మరికొంత మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇలా వ్యవహరిస్తే కరోనా వైరస్ ఉన్న వాళ్లు కూడా హాస్పిటల్ కి వెళ్లడానికి భయపడతారు. అంతేకాకుండా వాళ్ళు జన జీవన స్రవంతిలో ఉండి అనేక మందికి ప్రమాదకరంగా మారతారు. కాబట్టి ప్రభుత్వం వైద్యుల విషయంలో చొరవ తీసుకోవాలని చాలామంది అంటున్నారు.