కేంద్రమంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన వారికి కేంద్రం శాఖలు కేటాయించింది. కేంద్ర సహాయమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కు గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ (సహాయ)ను అప్పగించింది. అటు నరసాపురం బీజేపీ ఎంపీ శ్రీనివాస వర్మకు ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయమంత్రిగా అవకాశం కల్పించింది.
కాగా, టీడీపీ తరుపున గుంటూరు నుండి పోటీ చేసి ఎంపీగా గెలిచిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయనకు క్యాబినెట్ మంత్రి పదవి ఇచ్చేందుకు కూటమి నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఆయన నిన్న ద్రౌపథి ముర్ము సమక్షంలో క్యాబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.