ఢిల్లీ కాలుష్యం పై కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

-

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ కాలుష్యంపై టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు సుప్రీంకోర్టుకు తెలిపింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు సుప్రీం కోర్టు లో అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. కాలుష్య నియంత్రణ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్ ఫోర్స్, ఫ్లయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేస్తుందని పేర్కొన్న కేంద్రం… ఐదుగురు సభ్యులతో కూడిన టాస్క్‌ఫోర్స్‌ను నియమించింది. కేంద్రం నియమించిన టాస్క్‌ఫోర్స్‌కు శాసనాధికారాలను కూడా ఇచ్చినట్లు అఫిడవిట్‌లో వెల్లడించింది.

నిబంధనలు ఉల్లంఘించిన వారిని శిక్షించే విధంగా.. శాసన అధికారాలు కూడా టాస్క్‌ఫోర్స్‌కు ఇచ్చామని తెలిపింది. ప్రస్తుతం పనిలో ఉన్న 17 ఫ్లయింగ్ స్క్వాడ్‌లు నేరుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్‌కు నివేదిస్తాయని అఫిడవిట్‌లో పేర్కొన్న కేంద్రం… రానున్న 24 గంటల్లో ఫ్లయింగ్ స్క్వాడ్‌ల సంఖ్యను 40కి పెంచనున్నట్లు వెల్లడించింది. ఢిల్లీ లో ట్రక్కుల ప్రవేశంపై నిషేధం కొనసాగుతుందని…. నిత్యావసర వస్తువులతో కూడిన ట్రక్కులను మాత్రమే ప్రవేశానికి అనుమతిస్తారని పేర్కొంది కేంద్ర ప్రభత్వం.

తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు పాఠశాలలు మూసి ఉంటాయని అఫిడవిట్‌లో పేర్కొన్న కేంద్రం… సీఏక్యూఎం చైర్‌పర్సన్ ఎంఎం కుట్టి నేతృత్వంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్‌ నియమించిన కేంద్రం… సీపీసీబీ చైర్మన్ తన్మయ్ కుమార్ టాస్క్‌ఫోర్స్‌లో సభ్యులుగా ఉంటారని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్ ఫోర్స్‌లో సభ్యులుగా..డీజీ టీఈఆర్‌ఐ విభా దావన్, మధ్యప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి మాజీ చైర్మన్ ఎన్‌కే శుక్లా, ఆశిష్ దావన్ సీఏక్యూఎం ఎన్జీవో సభ్యుడు ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version