గుప్పెడంతమనసు 302: దేవయాని కుట్రను మహేంద్రతో చెప్పిన ధరణి

-

గుప్పెడంతమనసు ఈరోజు ఎపిసోడ్ లో జగతి, మహంద్రలు కారులో వస్తూ..రిషీ ఎక్కడికివెళ్లినట్లు అని మాట్లాడుకుంటారు. జగతి ఎక్కడికి వెళ్తే ఏంటంట..చిన్నపిల్లాడు ఏం కాదు కదా అంటుంది. అక్కడ వసూ ఎలా ఉందో ఏంటో త్వరగా వెళ్దాం మహేంద్ర అంటుంది. ఇంకోవైపు రిషీ మంచి భోజనం చేశాను అని, థ్యాంక్స్ చెప్తాడు. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి అంటుంది వసూ. అదేంటి అని రిషీ అంటే..జగతి మేడమ్ ఇంటికి వచ్చి అడిగిమరీ భోజనం చేశారు. నాకు చాలా సంతోషంగా ఉంది అంటుంది. రిషీ మనసులో అవును నేనేంటి ఇలా చేశాను, ఇక్కడ ఇంత సేపు ఎందుకు ఉన్నాను అనుకోని అంతే వెళ్లిపోతాడు. వసూ ఎంత ఆపినా ఆగకుండా వెళ్లిపోతాడు. రిషీ కారులో వస్తూ..నేనేంటి ఇలా చేశాను, ఇష్టం లేని వాళ్ల ఇంటికి వెళ్లినప్పుడు ఇష్టం లేనట్లే ప్రవర్తించాలి కదా, వసుధారతో మాట్లాడుతూ నన్ను నేనే మర్చిపోయాను, ఇలాంటి పొరపాటు ఎప్పుడూ చేయను కదా, నేను రిషేంద్రబూషన్…చిన్నచిన్న విషయాల గురించి ఆలోచించకూడదు.,పట్టించుకోకూడదు అని తనని తను సమర్థించుకుంటాడు.
మరోసీన్ లో జగతి, మహేంద్ర, వసూ హాల్ లో కుర్చుంటారు. మహేంద్ర కాల్ వచ్చి బయటకు వెళ్తాడు. జగతి కాఫీ తీసుకురావటానికి వెళ్తూ.. డైనింగ్ టేబుల్ పై ఉన్న తినేసిన ప్లేట్స్ చూసి వసుధారను పిలిచి అడుగుతుంది. చెప్పటం మర్చిపోయాము మేడమ్..రిషీ సార్ ఇంటికి వచ్చారు, ఆకలేస్తుంది అని అడిగిమరీ భోజనం వండించుకుని తిన్నారు అంటుంది వసూ. జగతి వాట్..రిషీ ఇంటికి వచ్చి, ఆకలేస్తుంది అని అడిగిమరీ, నువ్వు భోజనం చేసేవరకూ ఉండి తిని వెళ్లాడా అంటుంది. అవును మేడమ్ నేను కూడా నమ్మలేకపోయాను అంటుంది వసూ. నమ్మడం నమ్మలేకపోవటం కాదు వసుధార, నువ్వే మా ఇంట్లో గెస్ట్ వి, నువ్వు ఇంకోకరిని ఇంటికి పిలిచి భోజనంపెట్టి పంపిస్తున్నావా అంటుంది. వసూకి ఏం అర్థంకాదు..మేడమ్ అంటుంది. జగతి ఫుల్ కోపంతో మేడమ్ ఏంటి మేడమ్..నా ఇంట్లో గెస్ట్ గా నువ్వు వచ్చావు, నీ వైపు నుంచి ఇంకొక గెస్ట్ వచ్చినప్పుడు నాకొక మాట చెప్పాలికదా, మినిమమ్ మేనస్ కదా..అది నీ కనీస ధర్మంకదా అంటుంది జగతి. వచ్చింది రిషీ సారే కదా మేడమ్ అని వసూ అంటే..రిషీ సార్ వస్తే నాకు చెప్పాల్సన అవసరం లేదుకదా, మీ అంతట మీరు వంటచేసుకుంటారు, తింటారు, నేను వచ్చి కంచాలు చూసి గుర్తుపట్టి అడగాలా, ఏంటి వసూ నువ్వు, ఏమనుకుంటున్నావు అంటుంది జగతి. వసూ ఏంటి మేడమ్ మీరు ఇలా మాట్లాడుతున్నారు, రిషీ సార్ వచ్చి తిన్నారంటే మీరు సంతోషపడతారు అనుకున్నాను అంటుంది. అన్నింటికి సంతోషపడుతున్నాను కదా, జరిగే సంఘటనలు అన్నింటికి రోజూ బోలెడంత సంతోషపడుతున్నాను, ఇది కరెకటు కాదు వసూ, ఇంకొకసారి ఇలా చేయకు, భోజనం విషయం కాబట్టి ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, నా ఇంట్లో ఒక గెస్ట్ వచ్చి తిన్నప్పుడు నాకొక మాట చెప్పాలి కదా అని వెళ్లిపోతుంది.
వసూ మేడమ్ ఏంటి ఇలా మాట్లాడారు..రిషీ సార్ వచ్చారంటే సంతోషపడతారు అనుకుంటే ఇలా అన్నారేంటి అనుకుంటుంది. జగతి కొంచెం ముందుకెళ్లి వసూ వైపు చూస్తుంది. అమ్మా నా కొడుకు నా ఇంటికి వచ్చి భోజనం చేస్తే నాకు ఒక మాట చెప్పొచ్చుగా..చూసి ఎంత సంతోషించేదాన్ని, మంచి ఛాన్స్ మిస్ అయింది. వసూకి బాగా అయింది, ఆ భయం అలాగే ఉండనీ.. ఈ సారి వచ్చినప్పుడైనా చెప్పుంది అని మనసులో అనుకుని వంటగదిలోకి వెళ్తుంది. సీన్ అంతా అయిపోయాక మహేంద్ర లోపకిలికి వస్తాడు. ఏమైంది వసుధార అంటే..వసూ జరిగింది చెప్తుంది. మహేంద్ర ఏంటి రిషీ ఇక్కడికి వచ్చి భోజనం చేశాడా,, నేను నమ్మలేకుండా ఉన్నాను అంటాడు .
మరోసీన్ లో దేవయాని, ఫణీంద్ర హాల్ లో కుర్చోని ఉంటారు. ఎగ్జామ్స్ హడావిడిలో పడి టైంకు తినటం లేదు..కాస్త ఆరోగ్యం కూడా చూసుకోండి అంటుంది దేవయాని. అలా ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా రిషీ వస్తాడు. ఫణీంద్ర ఎగ్జామ్స్ కు సంబంధించి అన్ని చూసుుకంటున్నారు..నువ్వు కాలేజ్ లో కనిపించలేదే అంటాడు. దేవయాని ఇప్పుడైనా తెలుస్తుందిలే అనుకుంటుంది. అవన్నీ చూశాను..నో ప్రాబ్లమ్ బానే ఉన్నాయి అంటాడు. పాపం జగతి బాగా కష్టపడుతుంది అంటాడు ఫణీంద్ర.దేయాని అవును రిషీ కాలేజ్ లో లేవంటున్నారు, ఎక్కడికి వెళ్లావ్ అంటే…ఫణీంద్ర గస్ట్ హాస్ కి నేను వచ్చాను నువ్వు కనిపించలేదే అంటాడు. మీరు వచ్చినప్పుడు నేను ఎక్కడున్నానో, మీరు ఎక్కడున్నానో అంటాడు. అది నిజమేలే అంటాడు ఫణీంద్ర.
ఇక్కడ వసూ చదువుకుంటూ ఉంటుంది. వసూ చూసి నా రిషీ నా ఇంటికి వచ్చి భోజనం చేశాడు..కష్టాల్లో వసూకి నేను చేసిన సాయం మా జీవితాన్ని ఎన్ని మలుపులు తిప్పుతుందో, థ్యాంక్స్ వసుధార అనుకుంటుంది. తర్వగా నిద్రపో అని జగతి రూంలోకి వెళ్తుంది. మహేంద్ర, ధరణి మాట్లాడుకుంటూ..మా యువరాజు నిద్రపోయాడా అని మహేంద్ర అంటే..నాకు తెలిసి నిద్రపోడు మావయ్యాగారు అంటుంది. అలా రిషీ గురించి మాట్లాడుతూ..అత్తయ్యాగారు కూడా రిషీ గురించే బాగా ఆలోచిస్తున్నారు అని కాల్ చేసింది చెప్తుంది. ఓపిక పడుతున్నాను ధరణి, వదిన ఏదైతేజరగొద్దు అని టెన్షన్ పడుతుందో అది జరిగే రోజు వస్తుంది అంటాడు. అలా ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version