తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మెన్ గా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్ రెడ్డి దాదాపు ఖాయం అయిపోయారు. టీఆర్ఎస్ నుంచి ఆయన పేరును గులాబీ బాస్ సీఎం కేసీఆర్ ఖరారు చేసినట్టు సమాచారం కాగ మండలి చైర్మెన్ ఎన్నిక ప్రక్రియాకు సంబంధించిన అనుమతుల కోసం ఈ రోజు గవర్నర్ సంప్రదించే అవకాశాలు ఉన్నాయి. కాగ నేడు మండలి చైర్మెన్ ఎన్నికకు గవర్నర్ అనుమతి లభించగానే.. ఈ రోజే ఎన్నికకు సంబంధించిన నోటిఫికేషన్ సైతం విడుదల అయ్యే అవకాశం ఉంది.
నోటిఫికేషన్ వచ్చిన మరుసటి రోజే నామినేషన్స్ ప్రక్రియా ఉంటుంది. అన్ని సక్రమంగా జరిగితే ఈ నెల 12 వ తేదీనా.. చైర్మెన్ ఎన్నిక కోసం ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాగ శాసన మండలిలో చైర్మెన్ ఎన్నిక కోసం.. కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం ముందుకు వచ్చే అవకాశాలు లేవు. టీఆర్ఎస్ కు స్పష్టమైన మెజార్టీ ఉండటంతో ఈ ఎన్నిక దాదాపు ఎకగ్రీవం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాగ శాసన మండలి డిప్యూటీ చైర్మెన్ గా బండా ప్రకాశ్ పేరు వినిపిస్తుంది.