విశాఖ స్టీల్ ప్లాంట్ ఇప్పట్లో ప్రైవేటీకరణ జరగదని MP GVL నరసింహా రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అందరి మద్దతు లేకుండా ముందడుగుపడదని తేల్చి చెప్పారు MP GVL నరసింహా రావు. ఏడాది కాలంగా స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారం కోసం మా ప్రభుత్వాన్ని ప్రశ్నించాను…. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కొంటున్నామని KCR చెప్పుకోవడం చౌకబారు వ్యవహారం అని ఆగ్రహించారు.
స్టీల్ కొనుక్కోవడానికి వస్తూ స్టీల్ ప్లాంట్ కొంటున్నామని చేసిన ప్రచారం అపోహలు కల్పించే ప్రయత్నం లో భాగం అని ఆరోపణలు చేశారు MP GVL నరసింహా రావు. ప్లాంట్ ను పూర్తి స్థాయి ఉత్పత్తిలోకి తీసుకుని రావడానికి అనుసరించాల్సిన విధానాలపై సీఎండీతో మాట్లాడి అజెండా రూపొందించామన్నారు. ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది అందరి భాగస్వామ్యం ఉంటేనే సాధ్యం అని వివరించారు MP GVL నరసింహా రావు.