రాష్ట్ర విభజనపై ఏపీలో విచిత్ర చర్చ జరుగుతోంది : జీవీఎల్‌

-

రాష్ట్ర విభజనపై ఏపీలో విచిత్ర చర్చ జరుగుతోందని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గతంలో వైసీపీ కూడా విభజనకు లేఖలిచ్చిందని, అప్పుడు అలా చేసి.. ఇప్పుడు విభజనను వ్యతిరేకించామని వైసీపీ కొత్త కహానీలు చెబుతోందన్నారు జీవీఎల్.
తెలుగు రాష్ట్రాలు కలవాలనే నినాదం తీసుకు రావడం వెనుక కుట్ర ఉందని, తెలుగు రాష్ట్రాలు కలిసిపోతే.. 175 స్థానాలు వస్తే ఉమ్మడి రాష్ట్రంలో అధికారాన్ని చెలాయించవచ్చని వైసీపీ కోరుకుంటోందా..? అని జీవీఎల్ ప్రశ్నించారు. ‘కేంద్రం మంజూరీ చేసిన ప్రాజెక్టులను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటోందనే అంశంపై ఛార్జ్ షీట్లో పెడతాం.

 

ఐటీ రంగాన్ని విభజన తర్వాత నిర్లక్ష్యం చేశారు. విశాఖను ఐటీ హబ్ చేసేందుకు అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి. కొన్ని సంస్థలు ముందుకొస్తున్నా ఏపీ ప్రభుత్వ సహకారం లేకపోవడం వల్ల వెనక్కు వెళ్లిపోతున్నాయి. కేంద్ర ఇచ్చిన సహాకారాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందిపుచ్చుకోవాలి. తమకు కమిషన్లు వచ్చే ప్రాజెక్టులనే వైసీపీ, టీడీపీ ప్రభుత్వాలు అనుమతించాయి. గుజరాత్ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో 404 సీట్లే బీజేపీ టార్గెట్.
బీజేపీ అధినాయకత్వం తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అపార నమ్మకం సాధిస్తామనే నమ్మకం ఉంది. ప్రత్యర్థి పార్టీలకు బీజేపీ అంటే భయం పట్టుకుంది. కొన్ని పార్టీలు పేరు మార్చుకుని.. జాతీయ పార్టీ అని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాయి.’ అని జీవీఎల్‌ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version