ఈ అలవాట్ల వలన కిడ్నీ సమస్యలు వస్తాయట…!

-

చాలా మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కిడ్నీ సమస్యలు రావడానికి కొన్ని అలవాట్లు కారణమట. మరి ఎటువంటి అలవాట్లు ఉంటే కిడ్నీ సమస్యలు వస్తాయి అనేది ఇప్పుడు చూద్దాం. ఈ అలవాట్లకు దూరంగా ఉండకపోతే కిడ్నీ సమస్యలు తప్పవని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఎక్కువ ఉప్పు తీసుకోవడం:

ఎక్కువ ఉప్పు తీసుకోవడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. ఇది కిడ్నీలను దెబ్బతీస్తుంది. కాబట్టి ఉప్పు తగ్గించడం చాలా మంచిది.

ఎక్కువ మెడిసిన్స్ వేసుకోవడం:

కిడ్నీల నొప్పి వలన చాలా రకాల మందులను వాడుతూ ఉంటారు లిమిట్ దాటి మందులను ఉపయోగించడం వలన కిడ్నీలను దెబ్బతీస్తుంది. అందుకని మీకు నచ్చిన మందులు వాడకుండా వైద్యుని సలహా తీసుకోండి.

ప్రాసెస్డ్ ఫుడ్ మానండి:

ప్రాసెస్ ఫుడ్ వల్ల కూడా కిడ్నీ సమస్యలు కలుగుతాయి ప్రాసెస్డ్ చేసిన ఫుడ్ లో సోడియం, పాస్ఫరస్ ఎక్కువగా ఉంటుంది ఇది కిడ్నీ సమస్యలను తీసుకొస్తుంది.

ఎక్కువ మాంసాహారం తినడం:

ఎక్కువ మాంసాహారాన్ని తినడం వలన కూడా సమస్యలు వస్తాయి కనుక మాంసాహారానికి దూరంగా ఉంటే మంచిది.

ధూమపానం:

స్మోకింగ్ వలన కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి అలానే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు వస్తాయి. చూశారు కదా ఎలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంద..ని కాబట్టి ఇటువంటి అలవాట్లకు దూరంగా ఉంటే మంచిది. లేదంటే అనవసరంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version