ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హైదరాబాద్లో అడుగుపెట్టినప్పటి నుంచి తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు మొదలయ్యాయని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ అన్నారు. ఆయన ఎన్టీఆర్ భవన్ లో సోమవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం, సంస్కరణలు చేసిన పార్టీ టీడీపీ అని అన్నారు.హైదరాబాద్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పార్టీ అని తెలిపారు.
విభజన సమస్యలు పరిష్కరించుకుందాం అని చంద్రబాబు చొరవ తీసుకుని తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయడం అభినందనీయం, దీనిపై కూడా ఏవేవో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాధినేతలు భోజనాలు చేసుకున్నారే గానీ విభజన సమస్యలు పట్టించుకోలేదు.. పరిష్కారం చేయలేదు అని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ పార్టీకి ప్రజల గురించి మాట్లాడే హక్కు కోల్పోయింది. చర్చలతో సమస్యల పరిష్కారానికి బాబు కృషి చేస్తున్నారన్నారు. చంద్రబాబు దూరదృష్టితో తీసుకున్న పరిపాలన నిర్ణయాలే తెలంగాణ రాష్ట్రానికి మిగులు బడ్జెట్ కు ప్రధాన కారణం అని తెలిపారు.