ఏదైనా తప్పులు చేస్తే మన దేశంలో మినహా చాలా దేశాల్లో శిక్షలను చాలా వేగంగా అమలు చేస్తూ ఉంటారు. అందులో గల్ఫ్ దేశం అయిన సౌదీ అరేబియాలో అయితే మరీ వేగంగా చేస్తారు. అక్కడ తప్పు చేసిన వాడిని ఎలాంటి పరిస్థితుల్లో కూడా వదిలే అవకాశం ఉండదు అనేది అందరికి తెలిసిన విషయమే. అక్కడ శిక్ష పడింది అంటే చాలు దాన్ని అమలు చేసే వరకు వదిలే అవకాశం ఉండదు. అయితే ఇప్పుడు అక్కడ ఉరి శిక్షను రద్దు చేసారు.
మొన్నీ మద్యం కొరడా దెబ్బలను రద్దు చేసింది ఆ దేశ ప్రభుత్వం. ఇక ఇప్పుడు చిన్న పిల్లలు తప్పు చేస్తే మరణ శిక్షను రద్దు చేసింది. ఎవరైనా 18 ఏళ్ళ లోపు వాళ్ళు నేరం చేస్తే వాళ్లకు మరణ శిక్ష వేయరు. దీనికి సంబంధించి ఆ దేశ మానవ హక్కుల కమిషన్ చీఫ్ అవాద్ అల్వాద్ ఒక ప్రకటన విడుదల చేశారు. ‘ విజన్ 2030లో భాగంగా దేశంలోని అన్ని రంగాలలో కీలక సంస్కరణలను రూపొందించేందుకు దేశ ప్రభుత్వం కీలక అడుగు వేసిందని ఆయన చెప్పారు.
ప్రిన్స్ ముహ్మద్ బిన్ సల్మాన్ స్వయంగా వీటన్నింటిని పర్యవేక్షిస్తున్నారన్నారు ఆయన. కొత్త శిక్షాస్మృతిని స్థాపించడానికి గానూ తాజాగా నిర్ణయం దోహద పడుతుందని చెప్పారు. త్వరలోనే ప్రత్యామ్నాయ శిక్షలు అమలు చేస్తామని చెప్పారు. పిల్లలకు ఉరి శిక్ష వద్దని ఐరాసా కూడా కోరుతూ వస్తుంది. ఆ దేశంలో గత ఏడాది 189 మంది ప్రభుత్వం ఉరి తీసింది. ఈ ఏడాది 12 మందిని ఉరి తీసారు.