టీవీల్లోనూ అదరగొట్టిన ‘హనుమాన్’ మూవీ

-

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం హనుమాన్ . సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ టాక్ ను సొంతం చేసుకుంది. కేవలం రూ.75 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ చిత్రం దాదాపు 300 కోట్ల వరకు కలెక్షన్లు రాబట్టింది.ఈ సినిమాలో కథానాయికగా అమృతా అయ్యర్ నటించింది. మరో కీలకపాత్రలో వరలక్ష్మి శరత్ కుమార్ నటించింది.

ఇదిలా ఉంటే… హనుమాన్ సినిమా థియేటర్లు, ఓటీటీతోపాటు టీవీల్లోనూ అదరగొట్టింది. గత నెల 28న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగులో ప్రసారమైన ఈ చిత్రం 10.26 TRPని సాధించింది. ఆదికేశవ (10.47) తర్వాత ఇటీవల కాలంలో రెండంకెల TRPని సాధించిన మూవీ ఇదేనని తెలుస్తోంది. సలార్, గుంటూరు కారం, భగవంత్ కేసరి, నా సామిరంగ లాంటి చిత్రాలకు సింగిల్ డిజిట్ TRP వచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news