నేడు 21వ పుట్టిన రోజు జ‌రుపుకుంటున్న `గూగుల్‌`

-

ప్ర‌స్తుతం పెద్ద‌ల నుండి పిల్ల‌ల వ‌ర‌కు.. చేతిలోనే స్మార్ట్‌ఫోన్‌.. ప్రపంచమే అరచేతిలో.. ఫొటోల నుంచి సినిమాల వరకు.. పాటల నుంచి పాఠాల వరకు ఏమి కావాలన్నా, ఏ సర్వీసును ఉపయోగించుకోవాలన్నా గూగుల్‌పై ఆధారపడాల్సిందే. అయితే ఆ సెర్చ్‌ఇంజిన్‌ నేడు 21వ పుట్టినరోజు జరుపుకుంటోంది. 1998 సెప్టెంబరులో స్టాన్‌ఫోర్డ్‌ యూనివర్శిటీకి చెందిన ఇద్దరు పీహెచ్‌డీ విద్యార్థులు లారీ పేజ్‌, సెర్గీ బ్రిన్‌ కలిసి ఈ సెర్చ్‌ ఇంజిన్‌ను రూపొందించారు. googol అనే అర్థం వచ్చేలా ఈ సెర్చ్‌ ఇంజిన్‌కు google అని పేరు పెట్టారు.

googol అంటే చాలా పెద్ద సంఖ్య. అయితే ఎలాంటి స‌మాచారం అయినా ఈ సెర్చ్‌ఇంజిన్‌లో దొరుకుతుంది అని చెప్పేందుకు ఆ పేరు పెట్టారు.ఇక 21వ పుట్టిన‌రోజు సందర్భంగా గూగుల్‌ ప్రత్యేక డూడుల్‌ను తయారుచేసింది. ఇక పాతకాలం నాటి బాక్స్‌ కంప్యూటర్‌ మానిటర్‌పై గూగుల్‌ సెర్చ్‌ పేజీని చూపిస్తూ ఈ డూడుల్‌ను తయారుచేసింది. దానిపై 27 సెప్టెంబరు 1998 తేదీని చూపించే టైంస్టాంప్‌ కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news