కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఫైనల్ వెర్షన్ స్క్రిఫ్ట్ దశలో ఉంది. త్వరలోనే సెట్స్ మీదకు కూడా వెళ్లనుంది. కొరటాల శివ, మెగాస్టార్ కోసం ఓ మంచి సోషల్ మెసేజ్ తో కూడుకున్న స్క్రిప్ట్ ను తయారు చేసారట. ఈ సినిమా తొలి షెడ్యూల్ శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరగనుంది. దర్శకుడు కొరటాల శివ సైతం ఇప్పటికే అక్కడకు వెళ్లి షూటింగ్ లోకేషన్లు పరిశీలించారు.
ఇక ఈ సినిమాకు టెక్నీషియన్లు దాదాపుగా ఖరారయ్యారు. ప్రస్తుతం నటీనటులను ఎంపిక చేస్తోన్నట్లు తెలుస్తోంది. హీరోయిన్‌గా కాజల్ అగర్వాల్‌ను ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విషయానికి వస్తే కొరటాల తన సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తున్నాడని.. కొరటాల మొదటి సినిమా ‘మిర్చి’ నుండి.. ఆ తరువాత కొరటాల తీసిన శ్రీమంతుడు, జనతాగ్యారేజ్ సినిమాలకు మ్యూజిక్ ఇచ్చిన రాక్‌స్టార్ దేవిశ్రీప్రసాద్‌ను కాదని.. సైరాకు మ్యూజిక్ ఇచ్చిన అమిత్ త్రివేదిని సంగీత దర్శకుడిగా పెట్టుకున్నాడని ఇటీవలే మీడియాలో బాగా వార్తలు వచ్చాయి.
అయితే ఇవన్నీ పుకార్లే అని తెలుస్తోంది. మరోసారి కొరటాల తన సెంటిమెంట్‌నే కంటిన్యూ చేస్తున్నాడు. తనకు బాగా అచ్చొచ్చిన దేవిశ్రీప్రసాద్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా కంటిన్యూ చేయనున్నాడట. చిరు డ్యూయల్ రోల్ చేసే ఈ సినిమా కోసం చిరు లుక్ చాలా కొత్తగా ఉండేలా కొరటాల జాగ్రత్తలు తీసుకోనున్నాడు. కంటిన్యూగా షూటింగ్ జరిపి 2020 సమ్మర్‌లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.