అందరికి వ్యాక్సిన్ అందేలా కేంద్రం’ హర్ ఘర్ దస్తక్‘ ప్రోగ్రాం

-

దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. మరోవైపు కొత్త వేరియంట్లు భయపెడుతున్నాయి. ఇప్పటికే దేశంలో పలు రాష్ట్రాల్లో ఏ.వై 4.2 కరోనా వేరియంట్ భయపెడుతోంది. దీంతో వ్యాక్సినేషన్ ప్రోగ్రాంను మరింత వేగం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దేశంలో ఇప్పటికే రికార్డ్ స్థాయిలో కరోనా వ్యాక్సిన్ డోసులను అందించారు. దాదాపుగా 104 కోట్ల డోసులను దేశ ప్రజలకు అందించారు. తాజాగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని మరింత వేగం పెంచేందుకు కేంద్రం ’హర్ ఘర్ దస్తక్ ‘ కార్యక్రమాన్ని  ప్రారంభించనుంది. గడప గడపకు వ్యాక్సినేషన్ అందేలా క్యాంపెన్ ప్రారంభించనుంది. నవంబర్ 2 నుంచి ధన్వంతరి దివాస్ రోజున ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ముఖ్యంగా దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రోగ్రాంతో వెనుకబడిన జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ జిల్లాల్లో ఇంటింటికి వ్యాక్సినేషన్ ఇవ్వడం ద్వారా మరింత త్వరగా కరోనాను అంతం చేయొచ్చని కేంద్రం భావిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news