క్రైం బీట్ : మాట‌ల‌కు అందని దారుణం ! క్షుద్రపూజల పేరుతో…

-

మహిళలు మాతృ మూర్తులు..మనకు జన్మను ఇచ్చిన దేవతలు..ఇలాంటివి కేవలం మదర్స్‌ డే లాంటి రోజులకు అంకితం. లేదా పుస్తకాలకు పరిమితం..సమాజం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. మహిళలకు ఇంట, బయటా రక్షణ లేకుండా పోయిందన్న‌ది క‌ఠోర వాస్త‌వం. లోకంలో ఆడవాళ్ళ పై ఆఘాయిత్యాలు మాత్రం మారలేదు. దేశంలో ఎక్కడో చోట ఏదొక ఘటన వెలుగు చూస్తోంది. కామ వాంఛ‌లను తీర్చుకునేందుకు ఎంతకైనాతెగిస్తున్నారు. అమాన‌వీయ ధోర‌ణిలో మానాన్ని దోచుకుంటున్నారు అటుపై ప్రాణాల్ని సైతం అత్యంత పాశ‌వీకంగా తీస్తున్నారు.ఇటువంటి ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. నిర్భయ, దిశ లాంటి ఎందరో మహిళలు మాన, ప్రాణాలను కోల్పోతున్నారు.

పోలీసులు ఎప్పటికప్పుడు ఇలాంటి వాటికి చెక్ పెడుతున్న కూడా.. బెదిరించో, భయపెట్టో కామ వాంఛ‌లుతీర్చుకుంటున్న మృగాళ్లు ఎంద‌రెంద‌రో ఉన్నారు.. వయస్సు తో అస్సలు వీరికి సంబంధం లేదు. అంతగా దారుణాలకు దిగుతున్నారు. ఇంత‌టి దుర్భ‌రావ‌స్థ‌ల‌కు తార్కాణంగా తాజాగా మధ్య ప్రదేశ్ లో మరో ఘటన వెలుగు చూసింది. సైన్స్ ఒకవైపు పెరుగుతున్నా కూడా మూఢనమ్మకాలు మాత్రం ఆగలేదు. మంత్రాల పేరుతో యువతులను మోసం చేస్తున్నారు. ఇప్పుడు వెలుగు చూసిన ఘటన అందరినీ షాక్ కు గురి చెస్తుంది.క్షుద్రపూజల పేరుతో కొందరు కేటుగాళ్లు ఓ బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కొన్ని రోజుల తర్వాత ఆ బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. సుబ్బయ్య ,భాస్కర్ అనే ఇద్దరు వ్యక్తులు గ్రామంలో క్షుద్రపూజలు చేస్తుండేవారు. ఈ క్రమంలో ఆ గ్రామానికి చెందిన పదహారేళ్ల బాలికకు క్షుద్రపూజలతో భయం కల్పించారు. నీ కుటుంబంలో ఓ సమస్య ఉంది.. మేము చెప్పినట్టు వినాలి.. మేం చెప్పిన విధంగా విన‌క‌పోతే నీ తల్లిదండ్రలకు మరణం తప్పదని తనను ఇబ్బందులకు గురిచేశారు. ఆ విధంగా భయపెట్టి ఆమెపై మూడు నెలలుగా లైంగిక దాడికి పాల్పడ్డారు. దాడికి చేసిన కొన్ని రోజులకు ఆమె అనారోగ్యం పాలై మంచం ప‌ట్టింది.

తల్లిదండ్రులు వైద్య పరీక్షలు చేయించగా బాలిక గర్భం దాల్చిన విషయం తెలిసింది. విషయం తెలియగానే తల్లిదండ్రులు ఆమెను ఆరా తీయగా తనపై జరిగిన దాడి గురించి చెప్పుకుంది..ఈ ఘటన పై పొలిసులకు ఫిర్యాదు చేశాయి బాధిత వ‌ర్గాలు. వారు అందించిన వివరాల మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల‌ను అదుపులోకి తీసుకొని విచారణ జ‌రిపారు.
ఇదీ నయా భారతం.. ఆడ‌బిడ్డ‌ల మాన‌,ప్రాణాల‌కు క‌నీస ర‌క్షణ ఇవ్వ‌లేని స‌మాజం.

Read more RELATED
Recommended to you

Exit mobile version