నిన్న మధ్యాహ్నం బీసీసీఐ ఇండియాలో జరగనున్న వన్ డే వరల్డ్ కప్ లో పాల్గొనబోయే జట్టును ప్రకటించింది. అప్పటి నుండి పాజిటీవ్ గానో లేదా నెగటివ్ గానో ఈ జట్టు గురించిన వార్తలు మరియు విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఆసియా కప్ లో ఆడుతున్న జట్టులో ఉన్న వారినే సెలెక్ట్ చేసి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చేతులు దులిపేసుకున్నారు. ఈ టీం లో మొత్తం 6 మంది బ్యాట్స్మన్ లు, ముగ్గురు ఆల్ రౌండర్లు, నలుగురు బౌలర్లు, ఒక సెప్షలిస్టు స్పిన్నర్ మరియు ఒక కీపర్ ఉన్నారు. ఈ కూర్పు మంచిదే అయినప్పటికీ ఒక స్పిన్నర్ విషయంలో సెలెక్టర్లు పొరపాటు చేశారంటూ మాజీ ఇండియన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన అభిప్రాయాన్ని తెలియచేశాడు. గత కొంతకాలంగా ఫామ్ లో లేనంత మాత్రాన చాహల్ ను వరల్డ్ కప్ కు ఎంపిక చేయకపోవడం చాలా విచారకరం అన్నాడు హర్భజన్ సింగ్.
ఇతను ఒంటి చేత్తో మ్యాచ్ ను మలుపు తిప్పగల స్పిన్ మాంత్రికుడు అంటూ అతనిపై ప్రశంసలు కురిపించాడు. చాహల్ ఈ మధ్యన ఫామ్ లో లేకపోవడం అదే సమయంలో కుల్దీప్ యాదవ్ రాణిస్తుండడం కారణమని చెప్పాలి.