హార్దిక్ కెప్టెన్సీ అదుర్స్: ఐపీఎల్ 2023 లో బిగ్గెస్ట్ విన్ ఇదే !

-

నిన్న ముగిసిన రాజస్థాన్ మరియు గుజరాత్ మ్యాచ్ లో హార్దిక్ పాండ్య తన టీం కు 9 వికెట్ల విజయాన్ని అందించాడు. రాజస్థాన్ ను మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 118 పరుగులకే పరిమితం చేసి ఔరా అనిపించాడు. తనకున్న బౌలింగ్ వనరులను సమర్ధవంతంగా ఉపయోగించి ప్రత్యర్థులను బోల్తా కొట్టించాడు.. ముఖ్యంగా స్పిన్నర్లు రషీద్ ఖాన్ మరియు నూర్ అహ్మద్ లను వాడిన విధానం ఆకట్టుకుంది. స్పిన్నర్లను టైం చేయడానికి ఇబ్బంది పడుతున్న రాజస్థాన్ ఆటగాళ్లను కళ్ళు తెరిచి చూసేలోపు నష్టం జరిగిపోయేలా చేశాడు. ఏ దశలోనూ రాజస్థాన్ ను కోలుకోనీయకుండా బ్రేకులు వేస్తూ వచ్చాడు. అనంతరం చేధనకు దిగిన గుజరాత్ కేవలం 13 .5 ఓవర్లలోనే అంటే 37 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఒక్క వికెట్ కోల్పోయి ఛేదించి ఈ ఐపీఎల్ లోనే పెద్ద విజయాన్ని నమోదు చేసింది.

ఈ విజయంతో గుజరాత్ టైటాన్స్ ఆడిన 10 మ్యాచ్ లలో 7 గెలిచి 14 పాయింట్లతో ప్లే ఆఫ్ కు మరింత దగ్గరైంది. అందరూ హార్దిక్ పాండ్య కెప్టెన్సీ ని పొగిడేస్తున్నారు, గత సీజన్ లో టైటిల్ ను అందించిన హార్దిక్ మరోసారి టైటిల్ ను అందుకోవడానికి తగిన శ్రమ చేస్తున్నాడు.

 

Read more RELATED
Recommended to you

Latest news