నేడు మహబూబ్నగర్ జిల్లాలో అమరరాజా లిథియం అయాన్ బ్యాటరీ గిగా ప్లాంటుకు శంకుస్థాపన చేయబోతున్నట్లు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఎలక్ట్రిక్ వాహనాలు, సస్టేనబుల్ మొబిలిటీకి తెలంగాణ కేంద్రంగా మారెందుకు ఇది గొప్ప ముందడుగు అని పేర్కొన్నారు.
ఈ రంగంలో ఇండియాలో అతిపెద్ద పెట్టుబడుల్లో ఇదొకటని తెలిపారు. ఇందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు అమర రాజా యజమాని గల్లా జయదేవ్ కు థాంక్స్ చెప్పారు. అలాగే, ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా ఐటీ సేవలు విస్తరించాలన్న ఉద్దేశంతో పలు నగరాల్లో ఐటీ టవర్లు నిర్మించేందుకు తెలంగాణ రాష్ట్ర సర్కార్ యోచన చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే మహబూబ్‌నగర్‌కు ఐటీ సేవలను విస్తరించేందుకు ప్రణాళిక చేసింది. మహబూబ్‌నగర్ జిల్లాకు తలమానికం కానున్న ఐటి కారిడార్‌లో తొలి కంపెనీని ఇవాళ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు.