నటి నిధి అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ చిన్నది అనేక సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. నిధి అగర్వాల్ ప్రస్తుతం కొన్ని సినిమాలలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. కాగా గత కొద్ది రోజుల క్రితం ఈ చిన్నది పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా అవకాశాన్ని సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

కాగా ఈ సినిమా నుంచి నిధి అగర్వాల్ తప్పుకున్నట్లుగా సమాచారం అందుతుంది. ఈ సినిమా నుంచి నిధి అగర్వాల్ తప్పుకోవడంతో వేరే సినిమాలలో అవకాశాలు వచ్చినట్టుగా తెలుస్తోంది. కొత్త సినిమా ప్రాజెక్టుల కోసమే నిధి అగర్వాల్ ఈ నిర్ణయం తీసుకుందని సమాచారం అందుతోంది. ప్రస్తుతం ఈ చిన్నది వేరే సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతోంది. ఎప్పటిలానే మళ్లీ నిధి అగర్వాల్ తన సినిమాలతో మంచి గుర్తింపు సొంతం చేసుకోవాలని ప్లాన్ లో ఉందట. దీనికి సంబంధించి మరింత సమాచారం వెలువడాల్సి ఉంది.