కాపు రిజర్వేషన్ ఉద్యమం నుండి ముద్రగడ పద్మనాభం తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే ఆయన తప్పుకున్నాక ఈ ఉద్యమాన్ని ఎవరు నడుపుతారు అనేది ప్రస్నార్ధకంగా మారింది. ఈ సమయంలో తెర మీదకు వచ్చారు మాజీ ఎంపీ, హరిరామజోగయ్య. ముద్రగడ పద్మనాభం ఉద్యమానికి రాజీనామా చేసిన అనంతరం కాపు పెద్దలంతా ఉద్యమాన్ని నడిపించాలని కోరారని ఆయన అన్నారు. కాపుల విద్య, ఉద్యోగ రిజర్వేషన్ కొరకు నా ఊపిరి ఉన్నంత వరకు పోరాడుతానని జోగయ్య అన్నారు.
నాకు వయసు పై బడినా ఇప్పటికి మెంటల్ గా నేను బాగానే ఉన్నానని అన్నారు. కాపు ఉద్యమంలో పోరాడతామని ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్ళిన కాపు నాయకులు నాకు మద్దతు పలికారని జోగయ్య అన్నారు. కాపు ఎమ్మెల్యేలని, మంత్రులని కాపు సంక్షేమ సేన నాయకులని, ముఖ్యమంత్రిని కలిసే అవకాశం కల్పించాలని కోరానని జోగయ్య తెలిపారు. ఈ ప్రభుత్వం కాపు రిజర్వేషన్ కల్పించుకుంటే రోడ్లెక్కి ఉద్యమాలు చెయ్యమన్న ఆయన న్యాయ పోరాటం చేస్తామని అన్నారు.