శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో చివరి, తొమ్మిదో రోజు ఉదయం చక్రస్నానం వేడుకగా జరిగింది. కొరోనా నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పుష్కరిణిలో ఈ కార్యక్రమం జిరగింది.
ఆదివారం చక్రస్నానం శాస్త్రోక్తంగా ఉదయం 6.00 నుంచి 9.00 గంటల నడుమ శ్రీవారి ఆలయంలోని అయిన మహల్ ముఖ మండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారికి, శ్రీ సుదర్శన చక్రత్తాళ్వార్లకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం అయిన మహల్ ముఖ మండపం ప్రాంగణంలో ప్రత్యేకంగా నిర్మించిన చిన్న పుష్కరిణిలో ఉదయం 8.15 గంటలకు సుదర్శన చక్రాన్ని పవిత్ర పుష్కరిణీజలంలో ముంచి, స్నానం చేయించారు. చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథ స్నానమే. ముందుగా ఉభయదేవేరులతో శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అభిషేకం చేస్తారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్ ప్రసన్నుడవుతాడు. చక్రస్నానం సమయంలో భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందుతారు.
స్వామివారికి బ్రహ్మోత్సవాల చివరిఘట్టానికి చేరుకున్నాయి.