హుజూరాబాద్‌లో ప్రస్తుతం జరుగుతున్నరాజకీయాలు అందరినీ ఒక్కరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంది. ఎందుకంటే గతంలో భుజాలు, భుజాలు రాసుకొని రాజకీయాలు చేసిన వారే ప్రస్తుతం చరిత్రను తామే బయట పెట్టుకుంటున్నారు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ వర్సెస్ ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నట్టు ఇక్కడ పోటీ జరుగుతోంది. పార్టీలు పక్కన పెట్టి పరస్పరంగా ఒకరినొకరు విమర్శలు, ఆరోపణలు చేసుకునే దాకా వచ్చారు. నీ చరిత్ర అదే అంటే నీ చరిత్ర అదే అని తిట్టుకుంటున్నారు. నువ్వు అలా చేశావ్ అంటే నువ్వు ఇలా చేశావ్ అంటూ ఒకరి చరిత్ర ఒకరు బయట పెట్టుకుంటున్నారు.అయితే ఇక్కడే ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేస్తున్న విమర్శలు కొన్ని టీఆర్ఎస్‌ను ఇరకాటంలో పెట్టేలా ఉంటున్నాయి.
అదేటంటే మంత్రిగా ఉన్న సమయంలో రాజేందర్ హుజూరాబాద్ లో ఒక్క డబుల్ బెడ్ రూం ఇండ్లు కూడా నిర్మించలేదని అది ప్రశ్నిస్తే తనను తిడుతున్నారంటూ ఆరోపించారు. తాను ప్రశ్నలు సంధిస్తుంటే మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఎందుకు తనకు నోటికి వచ్చినట్లు తిడుతున్నారని ఆవేదన చెందారు. ఇక హరీశ్‌రావు మరో ఆరోపణలు చేశారు. రాజేందర్ మంత్రి గా ఉండి కూడా హుజూరాబాద్‌ను అభివృద్ది చేయలేదని చెబుతున్నారు. ఇక్కడే ఆయన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పిస్తున్నారు. అంటే టీఆర్ ఎస్‌లో మంత్రిగా ఉండి అభివృద్ధి చేయలేని స్థితి ఉన్నదంటే ఇప్పుడు మరి టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పని తీరు ఎలా ఉంటుందో ఉందో నని అడుగుతున్నారు నెటిజన్లు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లోనూ అది కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యేలు ఉన్న వాటిల్లో ఇలాగే అధ్వాన్న పరిస్థితి ఉన్నాయని ప్రతిపక్షాలు కూడా బాగానే చెబుతున్నాయి. మొత్తానికి మాజీ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న వ్యాఖ్యలు టీఆర్ఎస్ ప్రతిష్టను దిగజార్చే విధంగా ఉన్నాయని చెబుతున్నారు అనలిస్టులు.