పిఠాపురం కేంద్రంగా జోష్ పెంచింది జనసేన అయితే ఆదిలోనే అవాంతరాలు ఎదురవుతున్నాయి. అనుమతులు తీసుకోవడంలో జనసేన నేతలు విఫలమైనట్లు తెలుస్తోంది. అడుగడుగునా అడ్డంకులు వస్తున్నాయి. మొన్న వారాహికి పిఠాపురం కుక్కుటేశ్వర ఆలయంలో పూజలకి అనుమతి లేకపోవడం చూసాము అయితే ఇప్పుడు తాజాగా ఉప్పాడ లోని సురక్ష కేంద్రంలో ఏర్పాటు చేసిన మత్స్యకార మహిళల సభని ఈసీ ఫ్లయింగ్ స్క్వాడ్ అడ్డుకోవడంతో జనసేనకి షాక్ తగిలింది పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో నాలుగవ రోజు పర్యటన అభ్యంతరం ఆనందోత్సవాల నడుమ కొనసాగింది.
ఆంధ్ర బాపిస్టు చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు ర్యాలీగా పిఠాపురం మండలంలోని మాధవపురం ఉప్పరగూడెం ఇసుకపల్లి నాగులపల్లి మీదుగా పొన్నాడలోని దుర్గాని దర్శించుకున్నారు. తర్వాత మూలపేట మీదుగా బీచ్ రోడ్ నుండి ఉప్పాడ చేరుకున్నారు మత్స్యకర్లు పలకరించుకుంటూ ముందుకు వెళ్లారు ఫ్లయింగ్ స్క్వాడ్ వచ్చి పవన్ సభకి అనుమతి లేకుండా లేదని చెప్పింది. పిఠాపురం ఇన్చార్జి ఉదయ్ శ్రీనివాస్ ద్వారా విషయాన్ని పవన్ కి చేర్చారు. ప్లయింగ్ స్క్వాడ్ అధికారి రేపాక వరప్రసాద్ పవన్ కి విపులంగా ఎన్నికల నిబంధనలు చెప్పారు పవన్ స్వయంగా సభను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.