చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం చేయట్లేదని హరీష్ రావు విమర్శించారు. ట్విట్టర్ వేదికగా ఆసక్తికరమైన పోస్ట్ కూడా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉద్యోగులకు ఒకటవ తేదీని జీతాలు ఇస్తామని ప్రచారం చేస్తూ ఉన్నారని అయితే వాస్తవం మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ఉందని హరీష్ రావు అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో పనిచేస్తున్న ఐసిటి కంప్యూటర్ టీచర్లకి మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదని అన్నారు. వాళ్ళు అప్పులపాలై అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారని హరీష్ రావు అన్నారు. అయితే ఈ విషయం పై ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించాలని పెండింగ్ జీతాలని వెంటనే చెల్లించాలని బీఆర్ఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్నానని హరీష్ రావు వెల్లడించారు.