తెలంగాణలో అధికార పార్టీ నేతలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. దాదాపుగా ఇప్పటి వరకు 30 మంది ఎమ్మెల్యేలు వరకు కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. మంత్రులు కూడా కరోనా వైరస్ ఏ మాత్రం వదిలిపెట్టలేదు. తాజాగా తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కరోనా బారిన పడినట్టు వార్తలు వస్తున్నాయి.
ఈ నెల 7 నుంచి శాసనసభ సమావేశాల నేపథ్యంలో ఎమ్మెల్యేలందరికీ కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హరీష్ రావు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తెలుస్తోంది. తనకు కరోనా పాజిటివ్ వచ్చిందని కాబట్టి ప్రతి ఒక్కరూ పరీక్షలు చేయించుకోవాలని అధికారులకు హరీష్ రావు సూచనలు చేసినట్లు సమాచారం. అదే విధంగా కూడా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి సూచించారు. ఆయనకు కరోనా లక్షణాలు లేకుండానే పాజిటివ్ వచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది.