బీజేపీది ఒక లంగ పంచాయితీ : హరీష్‌ రావు

-

మరోసార కేంద్రంపై విమర్శలు గుప్పించారు మంత్రి హరీష్ రావు.. తెలంగాణలో యాసంగి పండేదే బాయిల్డ్ రైస్ అని ఇది అందరికీ తెలిసిన విషయమే.. మరీ బాయిల్డ్ రైస్ కొనమని చెప్పడం ఎందుకని ఆయన మండిపడ్డారు. అంటే తెలంగాణలో పండని పంటను కొంటామని చెప్పడం బీజేపీది ఒక లంగ పంచాయితీ అంటూ ఆయన అగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గం లో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే రఘునందన్ రావు తో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన.. రాయపోల్, తొగుట లో 3.5కోట్లతో కస్తూర్భా గాంధీ పాఠశాల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కస్తూర్భా పాఠశాల విద్యార్థినీలతో ముచ్చటించిన హరీష్‌రావు.. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థినీలకు హైజీనిక్ కిట్లు ప్రభుత్వం అందజేస్తున్నదని తెలిపారు.

అనంతరం.. రుదొడ్డి మండలకేంద్రంలో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల, రైతు వేదిక భవనాన్ని ఆయన ప్రారంభించారు. అలాగే.. పోతరెడ్డిపేట లో 50 మంది ఇళ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ.. బీజేపీ అంటేనే జూటే మాటలు చెప్పి మోసం చేయడం అని, వాళ్లు ఇప్పటి వరకు రైతులకు చేసిందేమీ లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందో చెప్పుకునేందుకు 10 పనులు ఉన్నాయని.. కానీ.. బీజేపీకి చెప్పుకోవడానికి ఒక్క పని సక్కగ లేదని విమర్శించారు. కానీ పెట్రోల్ డీజిల్ ధరలను మాత్రం పెంచిందని విమర్శించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version