తుమ్మల ఇంటికి హరీశ్.. ఖమ్మంలో రాజకీయ కాక

-

ఉమ్మడి ఖమ్మం జిల్లా బీఆర్ఎస్​లో రాజకీయం కాకరేపుతోంది. బహిరంగ సభ ఏర్పాట్ల పర్యవేక్షణకు వచ్చిన మంత్రి హరీశ్‌రావు దమ్మపేట మండలం గండుగులపల్లిలోని మాజీమంత్రి తుమ్మల ఇంటికి వెళ్లి కలవడం రాజకీయ వర్గాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. మంత్రి అజయ్, ఎంపీలు నామ, రవిచంద్రతో కలిసి తుమ్మల ఇంటికి వెళ్లిన హరీశ్‌రావు.. అక్కడే భోజనం చేశారు. అనంతరం తుమ్మలతో ఏకాంతంగా సమావేశమయ్యారు. ఇరువురిమధ్య పలు కీలక రాజకీయ అంశాలపైచర్చ జరిగినట్లు బీఆర్ఎస్ వర్గాల ద్వారా తెలిసింది.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు వచ్చినట్లు తుమ్మలకు.. హరీశ్‌ చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వారం వ్యవధిలో ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు పర్యటనలు, ఈ నెల 18న ఖమ్మం వేదికగా భారీ బహిరంగ సభకు హాజరుకావాలని.. తుమ్మలను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలిసింది. బహిరంగస భ విజయవంతానికి పనిచేయాలని కోరినట్లు సమాచారం.

జిల్లాలో కీలకనేతగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పార్టీపై ధిక్కార స్వరం వినిపిస్తున్న సమయంలో తాజా పరిణామాలపైనా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. రానున్న రోజుల్లో తుమ్మలకు సముచిత స్థానం కల్పిస్తామని ముఖ్యమంత్రి హామీగా హరీశ్‌రావు తుమ్మలకు చెప్పినట్లు చర్చ జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version