మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. మాగంటి గోపినాథ్ కు ICU లో చికిత్స కొనసాగుతుందని తెలిపిన మాజీ మంత్రి హరీష్ రావు.. టెన్షన్ వద్దన్నారు. కాగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పరిస్థితి విషమంగా ఉంది. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ పరిస్థితి విషమంగా ఉండటంతో ఆస్పత్రికి తరలించారు. కొన్నాళ్లుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్… గతంలో AIG ఆసుపత్రిలో గోపీనాథ్ కు చికిత్స తీసుకున్నారు.
harish rao on BRS MLA Maganti Gopinath health
ఈ తరుణంలోనే కోలుకొని మళ్లీ అస్వస్థతకు గురయ్యారు ఎమ్మెల్యే మాగంటి. ఇక కాసేపటి క్రితమే AIGకి జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తరలించారు. మరో 48 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమంటున్నారు డాక్టర్లు. అటు ఆస్పత్రికి మాజీ మంత్రి హరీష్ రావు, బీఆర్ఎస్ నేతలు చేరుకున్నారు. మాగంటి గోపినాథ్ కు ICU లో చికిత్స కొనసాగుతుందని తెలిపారు మాజీ మంత్రి హరీష్ రావు.