నిజామాబాద్ ఆస్పత్రి ఘటనపై హరీశ్ రావు స్పందన

-

నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వీడియోపై ఆస్పత్రి సూపరింటెండెంట్ స్పందించారు. తాజాగా ఈ ఘటనపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కూడా స్పందించారు. ఈ ఘటనపై తక్షణమే విచారణ జరపాలని డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ను ఆదేశించారు. వీలైనంత త్వరగా నిజానిజాలు తేల్చి నివేదిక అందజేయాలని అన్నారు.

ఓ రోగిని ఇద్దరు సహాయకులు రెండు కాళ్లు పట్టుకుని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు ఆ వీడియోలో కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే రోగి రెండు కాళ్లు పట్టుకుని లాక్కెళ్లాల్సి వచ్చిందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

దీనిపై నిజామాబాద్‌ ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ ప్రతిమారాజ్‌ వివరణ ఇచ్చారు. వీల్‌ఛైర్‌ తీసుకొచ్చేలోపు లిఫ్ట్‌ రావడంతో రోగి తల్లిదండ్రులు అతని కాళ్లు పట్టుకుని లాక్కెళ్లారని చెప్పారు. ఇది చూసి సిబ్బంది వారించి.. వీల్‌ఛైర్‌లో తీసుకెళ్లారని స్పష్టం చేశారు. ఇదంతా తెలియక ఎవరో ఒక వ్యక్తి వీడియో తీసి సోషల్‌ మీడియాలో ప్రచారం చేశారని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news