కమిషన్ ల కోసం కాంగ్రెస్ లో గొడవలు జరుగుతున్నాయి : హరీష్ రావు

-

సిద్దిపేటలో యాదవ కులస్తులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడిన హరీష్ రావు కీలక కామెంట్స్ చేసారు. కామారెడ్డి త్వరగా డిక్లరేషన్ అమలు చేయాలి. ఇక కులగణన పేరుతోదొంగ సర్వే చేసి బీసీల సంఖ్యను తగ్గించారు. రేవంత్ రెడ్డి ఇక్కడ దోచుకున్న డబ్బును ఢిల్లీకి పంపుతున్నాడు.

సీఎం అయిన తర్వాత 11 సార్లు ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్ కి రాహుల్ గాంధీ అపాయింట్ మెంట్ కూడా దొరకడం లేదు. కేసీఆర్ మన తెలంగాణ ఆత్మ గౌరవం నిలబెట్టారు. కానీ రేవంత్ రెడ్డి తెలంగాణ గౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారు. అలాగే ఏమైనా పని కావాలంటే మంత్రులకు 30 శాతం కమిషన్ కావాలంట. కాంగ్రెస్ భూ మాత భూమేతలాగా అయింది. పార్టీలో మంత్రులకు, ఎమ్మెల్యే కు కమిషల్ ల మధ్య గొడవలు కూడా జరుగుతున్నవి అని హరీష్ రావు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news