వైసీపీ అధినేత జగన్‌కు షాక్.. టీడీపీలోకి ఆయన సన్నిహితుడు?

-

భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి తొలిసారి షాక్ తగిలింది. ఆయన సన్నిహితుడు, సొంత జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత టీడీపీలోకి వెళ్తున్నట్లు తెలుస్తోంది. అయితే, అధికార వైసీపీ పార్టీలోనూ నేతల మధ్య ముఖ్యంగా ఎమ్మెల్యేలు, ఎంపీల మధ్య విభేదాలు ఉన్నట్లు ఆరోపణలు వచ్చాయి. తాజాగా అవి వెలుగులోకి వస్తున్నాయి.

ysrcpandtdp

ఈ క్రమంలోనే వైసీపీ నుంచి నేతలు బయటకు వెళ్తున్నారు. కడప జిల్లాకు చెందిన వైసీపీ కీలక నేత పార్టీని వీడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు సమాచారం. వైసీపీ అధినేత జగన్‌కు అత్యంత సన్నిహితుడు, సొంత జిల్లా కడపలో ఆయనకు సహకారమందించిన వైసీపీ నేతల మండిపల్లి రాం ప్రసాద్‌రెడ్డి జగన్‌కు షాక్ ఇచ్చారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించడంతో పాటు టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడును కలిశారు. కడప జిల్లాతో పాటు రాయచోటిలోని రాజకీయ పరిస్థితులపై చంద్రబాబు, రాంప్రసాద్‌రెడ్డి చర్చించుకున్నట్లు సమాచారం.

పాదయాత్ర సమయంలో రాం ప్రసాద్‌రెడ్డి కీలకంగా వ్యవహరించగా, ఆయన పార్టీని వీడటం వల్ల స్థానికంగా వైసీపీ స్థానిక వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ బలోపేతం కోసం ప్లాన్ చేయాలని రాంప్రసాద్‌రెడ్డికి చంద్రబాబుకు సూచించినట్లు తెలుస్తోంది. స్థానిక ఎమ్మెల్యే గడికోట్ శ్రీకాంత్‌రెడ్డితో ఉన్న గొడవల వల్లే రాంప్రసాద్‌రెడ్డి వైసీపీని వీడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తంగా వైసీపీ‌లోనూ అంతర్గత ముసలం మొదలైంది అనే చర్చ రాజకీయ వర్గాల్లో షురూ అయింది. ఇప్పటి వరకు వైసీపీ బానే ఉందన్న అంచనాలు ఇక తలకిందులవుతాయని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అయితే, వైసీపీ అధినేత జగన్‌పై వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు ఎప్పటి నుంచో బహిరంగ విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ విదితమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version