ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ఉపఎన్నిక పోరు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. అనూహ్యంగా మంత్రి పదవి నుంచి తొలగించబడ్డ ఈటల రాజేందర్, కాషాయ కండువా కప్పుకుని హుజూరాబాద్‌లో రాజకీయాలని వేడెక్కించారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ రాకముందే.. అన్ని పార్టీలు హుజూరాబాద్ లో పాగ వేశాయి. ప్రచారంలో ముందుకు సాగుతున్నాయి. అయితే ఇందులో భాగంగా.. ఈటల రాజేందర్ పై మరోసారి మంత్రి హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆత్మ గౌరవాన్ని కాపాడుకుంటామని చెప్పి టిఆర్ఎస్ ను వదిలి వెళ్ళిన ఈటల రాజేందర్.. బీజేపీలో చేరి తన ఆత్మగౌరవాన్ని ఢిల్లీకి తాకట్టు పెట్టారని చురకలు అంటించారు. కేవలం తన ఆస్తులను కాపాడు కునేందుకే బీజేపీలో చేరారని మండిపడ్డారు హరీష్ రావు. వచ్చే ఉప ఎన్నికల్లో హుజురాబాద్ లో టిఆర్ఎస్ పార్టీని గెలిపించి… ఈటల రాజేందర్ కు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. టిఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారని… అభివృద్ధే ధ్యేయంగా ప్రభుత్వం నడుస్తోందన్నారు.