తెలంగాణలో కాంగ్రెస్ కు పట్టిన గతే.. బీజేపీకి పడుతుంది – హరీష్ రావు

-

బీజేపీ పార్టీపై విరుచుకుపడ్డారు మంత్రి హరీశ్ రావు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కు పట్టిన గతే బిజెపికి పడుతుందని విమర్శలు చేశారు. నాడు కిరణ్ కుమార్ రెడ్డి రూపాయి ఇవ్వం, ఏం చేసుకుంటారో చేస్కోండి అన్నాడని.. గుర్తు చేశారు.

తెలంగాణ కాంగ్రెస్ నాయకులు నోరు మెదపలేదు.. కానీ, ప్రజలు గుణపాఠం చెప్పారు, కాంగ్రెస్ గల్లంతు చేశారన్నారు. నెత్తి లేని, కత్తి లేని నేతలు నత్తి నత్తి మాట్లాడుతారు…పెట్రోల్, డీజిల్ పై సెస్సుల పేరిట కేంద్రం 8 ఏళ్లలో 89 వేల కోట్లు వసూలు చేశారని నిప్పులు చెరిగారు మంత్రి హరీశ్ రావు. సెస్సుల పేరిట కేంద్రం అడ్డదారిలో ప్రజలను దోపిడీ చేస్తున్నదన్నారు మంత్రి హరీశ్ రావు.

అటు హైదరాబాద్ హయత్ నగర్ లో కారు నడుపుతూ గుండెపోటుకు గురైన వ్యక్తికి సీపీఆర్ చేసి రాచకొండ పరిధిలోని రామన్నపేట సీఐ మోతిరాం మానవత్వం చాటుకున్నారన్నారు హరీష్‌ రావు. సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ చేసి ప్రాణాలు నిలబెడుతున్న వారందరూ కనిపించే దేవుళ్ళు…సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. సీపీఆర్ పై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగితే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చని వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version