హరీశ్ శంకర్ ఆవేదన… టీ సర్కార్ కు సవాల్!

-

తెలంగాణలో కరోనా విలయ తాండవం చేస్తుంది. అది జగమెరిగిన సత్యం. అందులో ఎలాంటి సందహం లేదు. ఆ విషయాన్ని పక్కనబెడితే ముఖ్యంగా హైదరాబాద్ లో ఆసుపత్రుల పరిస్థితి కరోనా రోగుల ఆవేదనకు అద్దం పడుతుంది. కరోనా రోగుల విలవిలలాడుతున్నారని… ముఖ్యంగా మనిషి అనారోగ్యం బారిన పడితే ఈ సమయంలో ఏ ఆసుపత్రి కూడా తగిన విధంగా స్పందించక పోవడం వంటివి కూడా తెలంగాణ సర్కార్ కు పెద్ద సవాల్ గా మారింది! ఆ సంగతులు అలా ఉంటే హరీశ్ శంకర్ తాజాగా ఒక విషయంపై స్పందిస్తూ టి. సర్కార్ కు సవాల్ విసిరినంత పనిచేశారు!

“టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఓ వృద్ధుడి పరిస్థితి పట్ల చలించిపోయారు. 70 ఏళ్ల ఆ వృద్ధుడు శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాడని, అత్యవసరంగా అంబులెన్స్ పంపించాలంటూ మలక్ పేట యశోదా ఆసుపత్రి వర్గాలను అర్థించారు. తాను అనేకమందిని కోరినప్పటికీ ఎవరూ కూడ ఎంతమాత్రం సాయం చేసేందుకు ముందుకు రావడంలేదని హరీశ్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా సాయం చేయదలచుకుంటే ఫోన్ నెంబరు సోషల్ మీడియా ద్వారా మెసేజ్ చేయాలని సూచించారు. సాధ్యమైనంత వరకు ఈ క్లిష్ట సమయంలో సలహాలు ఇవ్వకుండా.. చేతనైనంత సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు” ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

అంటే ఇంతగా టాలీవుడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ ఆసుపత్రులపై వాపోవడానికి అసలు కారణం లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు. హైదరాబాద్ లో ఈ సమయంలో సాధారణ రోగులకు చికిత్స చేసేందుకు కూడా ఆసుపత్రుల యాజమాన్యం గానీ, వైద్యులు గానీ అంత సుముఖంగా లేరని స్పష్టం చేయడానికి హరీష్ అలా అన్నాడా అనే టాక్ కూడా నడుస్తోంది. నిజమే హరీష్ శంకర్ వృద్ధుడి కోసం పడుతోన్న వేదనలోని ఆవేదన ఆసుపత్రులు యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నది సత్యం.

అసలు ప్రభుత్వమే సరిగ్గా కరోనాపై వైద్యాన్ని అందించడంలో చురుకైన పాత్ర పోషిస్తే ఇంతవరకు వచ్చేది కాదని… ఈ ట్వీట్ కూడా అసలు ఉండేదు కాదని కూడా విశ్లేషకులు భావిస్తున్నారు. అసలు నిజంగా హరీష్ శంకర్ ట్వీట్ ప్రభుత్వానికే సవాల్ గా మారింది అనడంలో ఏమాత్రం సందేహం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు!

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version