రేవంత్‌కు ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిందా?

-

రాజకీయాల్లో కాన్ఫిడెన్స్ ఉండొచ్చు గానీ, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదని రాజకీయ విశ్లేషకులు, మేధావులు, పెద్దలు ఎప్పుడు చెబుతూనే ఉంటారు. కాన్ఫిడెన్స్‌తో రాజకీయాలు చేస్తే సక్సెస్ సులువుగానే వస్తుంది. కానీ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో సక్సెస్ అయిపోతాం అని ధీమాగా ఉంటే చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఇదే విషయంలో రేవంత్ రెడ్డి కాస్త ఆచి, తూచి ముందుకు అడుగులేస్తే బాగుంటుందని అంటున్నారు.

రేవంత్ రెడ్డి | Revanth Reddy

అసలు రాష్ట్ర విభజన జరిగాక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి వరుస ఓటములు ఎదురవుతున్నాయి. ఈ ఓటములతో పార్టీ పరిస్తితి మరీ ఘోరంగా తయారైంది. పైగా అధికార టీఆర్ఎస్ బలం మరింత పెరగడం, ఇటు కాంగ్రెస్ పార్టీకి ఉన్న ప్రతిపక్ష పాత్రని కూడా బీజేపీ లాగేసుకుని, టీఆర్ఎస్‌కు ధీటుగా నిలబడటం లాంటి పరిణామాలు..కాంగ్రెస్ శ్రేణులని బాగా క్రుంగదీశాయి. అయితే ఇలా ఇబ్బందుల్లో ఉన్న పార్టీకి రేవంత్ రెడ్డి కొత్త ఊపిరి పోసారని చెప్పొచ్చు.

అనూహ్యంగా పీసీసీ పదవి దక్కించుకున్న రేవంత్….కాంగ్రెస్‌లో నూతన ఉత్సాహం తీసుకొచ్చారు. దూకుడుగా రాజకీయాలు చేస్తూ, అధికార టీఆర్ఎస్‌కు ధీటుగా వచ్చారు. అలాగే ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ, ప్రజలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని నిరూపించారు. బీజేపీని సైడ్ చేస్తూ, కాంగ్రెస్ మాత్రమే టీఆర్ఎస్‌ని నిలువరించగలదు అని చెప్పే ప్రయత్నం చేశారు. ఇక దండోరా సభలతో కాంగ్రెస్ సత్తా తగ్గలేదని నిరూపించారు. ఇలా పార్టీకి పునర్వైభవం తీసుకోవడంలో రేవంత్ పాత్ర ఎంత చెప్పిన తక్కువే.

కానీ ఇలా పార్టీని నిలబెట్టడం కోసం కాన్ఫిడెంట్‌గా పనిచేస్తున్న రేవంత్…నెక్స్ట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 72 సీట్లు వస్తాయని చెప్పడం కాస్త ఓవర్‌గానే ఉందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ బలపడుతున్న మాట వాస్తవమే అని, అయితే ఇదే ఊపు ఎన్నికల వరకు ఉండాలని అప్పుడే పార్టీకి గెలిచే ఛాన్స్ ఉందని, పైగా బలమైన కేసీఆర్‌ని ఢీకొట్టడం అంత సులువు కాదని, అటు బీజేపీ బలం తగ్గించాలని, అప్పుడే రేవంత్ మాట నిజమవుతుందని అంటున్నారు. అలా కాకుండా ఇప్పుడే 72 సీట్లు వస్తాయని మాట్లాడటం కాస్త రేవంత్ ఓవర్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారని అర్ధమవుతుందని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version