మీ స్మార్ట్‌ఫోన్ దొంగిలించబడిందా..? మొబైల్ పర్సనల్ డేటా క్లియర్ చేసుకోండిలా..!

-

నేటి సమాజంలో ప్రతిఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్ కనిపించడం చూస్తుంటాం. మన జీవితంలో స్మార్ట్‌ఫోన్ అనేది ఒక భాగమైంది. మనకు సంబంధించిన అన్ని సమాచారాన్ని, పాస్‌వర్డ్, డాక్యుమెంట్స్, పర్సనల్ ఫోటోస్ మొబైల్ ఫోన్లలోనే సేవ్ చేసుకుంటున్నాం. అయితే చాలా సందర్భాల్లో స్మార్ట్‌ఫోన్స్ దొంగిలించబడటం చూస్తుంటాం. వాళ్లు ఫోన్‌ను కొట్టేసి పర్సనల్ డేటా సేకరించి బ్లాక్ మెయిల్ చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. ఒకవేళ బ్యాంకింగ్‌కు సంబంధించిన డేటా ఉన్నట్లయితే.. మీ ఖాతాలో ఉన్న డబ్బులు మాయమైనట్లే. ఇలాంటి పరిస్థితుల్లో మీ స్మార్ట్‌ఫోన్‌లోని మొత్తం డేటాను క్లియర్ చేయాలని అనుకుంటే.. ఈ ప్రాసెస్ పాటించండి.

స్మార్ట్‌ఫోన్

గూగుల్ తన ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం పలు సేవలు అందుబాటులోకి తెచ్చింది. స్మార్ట్‌ఫోన్ దొంగిలించబడిన వ్యక్తి.. తన ఫోన్ తిరిగి రాదనుకుంటే.. తమ పర్సనల్ డేటాను క్లియర్ చేసుకోవచ్చు. అలాంటి సదుపాయాన్ని గూగుల్ అందిస్తోంది. అయితే మీరు మీ స్మార్ట్‌ఫోన్ డేటా క్లియర్ చేసుకోవాలనుకుంటే.. మొదటగా మీ ఫోన్‌ను ట్రేజ్ చేసి కనుక్కోవాలి. దొంగిలించబడిన స్మార్ట్‌ఫోన్ ఇంటర్నేట్ డాటా ఆన్‌లో ఉండాలి. అప్పుడు ఈజీగా మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు. డాటా ఆన్‌లో ఉన్నప్పుడు మాత్రమే.. ఈ ప్లాన్ అమలు చేయాలి.

డేటా క్లియర్ చేయాలనుకుంటే..
దొంగిలించబడిన స్మార్ట్‌ఫోన్ డేటా క్లియర్ చేయాలంటే.. ముందుగా మీరు ఫైండ్ మై డివైస్ (Find my Device) యాప్‌ను డౌన్‌లోడ్ లేదా.. గూగుల్‌ వెబ్‌సైట్‌లోకి వెళ్లి సెర్చ్ చేయాలి. అప్పుడు గూగుల్ మ్యాప్ టైప్ పేజీ కనిపిస్తుంది. అప్పుడు మీరు మీ స్మార్ట్‌ఫోన్‌లో ఉపయోగించిన గూగుల్ అకౌంట్‌ను టైప్ చేసి లాగిన్ అవ్వాలి. అప్పుడు మీ గూగుల్ అకౌంట్ ఎక్కడుందో తెలుసుకునేందుకు ఫైండ్ మై డివైస్ వెతకడం ప్రారంభిస్తుంది.

అప్పుడు మీరు మీ స్మార్ట్‌ఫోన్ పోగొట్టుకున్న చివరి స్థానాన్ని చూపిస్తుంది. ఒక వేళ మీ ఫోన్ ఆన్‌లో ఉండి.. మీ ఇంటర్నెట్ డాటా ఆన్‌లో ఉంటే.. మీరు మీ ఫోన్‌ కదలికలను గమనించవచ్చు. అయితే ఈ ఫోన్‌ను మీరు కనుగొనలేకపోతే.. మీరు మీ పర్సనల్ డేటాను క్లియర్ చేయడం మంచిది. ఫైండ్ మై డివైస్‌లో డేటా తొలగింపు ఆప్షన్‌ను ఎంచుకోవాలి. మీ గూగుల్ అకౌంట్‌ను నిర్ధారించుకుని రీసెట్ చేయాలి. అతి తక్కువ సమయంలోనే మీ ఫోన్‌లో ఉన్న మొత్తం సమాచారం క్లియర్ అవుతుంది. అయితే మీరు మీ ఫోన్ మొత్తానికి దొరకదని భావించినప్పుడు మాత్రమే ఈ నిర్ణయం తీసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version