ట్రెండ్ ఇన్ : యశ్ ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ వర్సెస్ ఇళయ దళపతి విజయ్ ‘బీస్ట్’..

-

ఒకే రోజు ఇద్దరు పెద్ద హీరోల సినిమాల విడుదల ఉంటే ఆ రోజు హీరోలు చేసే హడావిడి మామూలుగా ఉండదు. తమ హీరో ఫిల్మ్ బాగా ఆడాలని ఇరువురు కథనాయకుల అభిమానులు అనుకుంటారు. ఇది సర్వసాధారణం. కాగా, కొవిడ్ మహమ్మారి వలన పిక్చర్ షూటింగ్స్ నిలిచిపోయి చాలా కాలం పాటు సినిమాల మేకింగ్ ఆగిపోయింది. పరిస్థితులు చక్కబడిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడు ఫిల్మ్ మేకర్స్ మూవీస్ షూటింగ్ కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. కాగా, ఒకే రోజు లేదా ఒక రోజు ముందర ఇద్దరు పెద్ద హీరోల సినిమాల విడుదల అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అటువంటి పరిస్థితి ఇప్పడు ‘కేజీఎప్ చాప్టర్ 2’, ‘బీస్ట్’ సినిమాలకు వచ్చింది.

పాన్ ఇండియా ఫిల్మ్ ‘కేజీఎప్ చాప్టర్2’ వచ్చే 14న విడుదల కానుండగా, కోలీవుడ్ ఫిల్మ్ ‘బీస్ట్’ 13న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ చాప్టర్ 2 వర్సెస్ బీస్ట్ అనే పరిస్థితులు నెలకొన్నాయి. మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ లో ఈ రెండు సినిమాల హ్యాష్ ట్యాగ్స్ #KGFChapter2, #Beast ట్రెండవుతున్నాయి. అయితే, విజయ్ ‘బీస్ట్’ సినిమాపై యశ్ చేసిన వ్యాఖ్యలు హీరో దళపతి విజయ్ అభిమానులనూ ప్రభావితం చేస్తుండటం గమనార్హం.

తాను సీనియర్ నటులు, హీరోలను గౌరవిస్తానని, ఇన్నాళ్ల పాటు ప్రజలను ఎంటర్ టైన్ చేసిన దళపతి విజయ్ ‘బీస్ట్’ సినిమాతో పాటు తన సినిమా ‘చాప్టర్ 2 కేజీఎఫ్’ ఆడాలని తాను కోరుకుంటున్నానని హీరో యశ్ చెప్పాడు. సినిమాలు ఎన్నికల మాదిరిగా కాదని, రెండిటినీ చూడొచ్చని, తాను రెండు ఫిల్మ్స్ చూస్తానని చెప్పుకొచ్చాడు. దాంతో విజయ్ అభిమానులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. యశ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హెల్దీ అట్మాస్పియర్ క్రియేట్ చేశారని అంటున్నారు. అలా పాన్ ఇండియా ఫిల్మ్ ‘చాప్టర్ 2 కేజీఎఫ్’తో పాటు కోలీవుడ్ ఫిల్మ్ ‘బీస్ట్’ రెండు చిత్రాలకు మంచి ఆదరణ లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయని సినీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news