సోము వీర్రాజుపై ఏపీ బీజేపీ తిరుగుబాటు !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర బిజెపిలో ముసలం నెలకొన్నట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుత పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా విజయవాడలో ఒక హోటల్ లో సమావేశయ్యారు ఏపీ బీజేపీ కీలక నేతలు. జాతీయ కార్మిక సంక్షేమ బోర్డ్ చైర్మన్ జయప్రకాష్ నారాయణ అద్వర్యంలో పార్టీ జాతీయ కార్యదర్శి వై సత్యకూమార్ కు ఆత్మీయసమావేశం పేరుతో సభ ఏర్పాటైంది.

ఈ సమావేశానికి బిజెపి నేతలు కన్నా లక్ష్మి నారాయణ లంకా దినకర్, తురగా నాగభూషణం, జమ్ముల శ్యామ్ కిషోర్, కిలారు దిలిప్ పాతూరి నాగభూషణం మాజీ MLA విష్ణు కుమార్ రాజు.. రమేష్ నాయుడు SK బాజీ శ్రీనివాసరాజు ఇతర ముఖ్య నేతలు హజరయ్యారు. ఏపీ బిజెపి అధ్యక్షుడి పేరు ప్రస్తవన లేకుండా ఈ సమావేశం జరిగింది.

ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో విజయనాకి తన వంతు కృషి చేసిన సత్యకుమార్ ను ఎపి రాజకీయాలపై దృష్టి పెట్టాలని కోరారు నేతలు. త్వరలో అద్యక్ష పదవి మార్పు ఉంటుందని భావిస్తోంది సోము వీర్రాజు వ్యతిరేక వర్గం. ఇందులో భాగంగానే… అధ్యక్ష పదవి కోసం పోటి పడుతున్న సత్యకుమార్ ను పొగడ్తలతో ముంచేత్తారు నేతలు. సోము వీర్రాజు లేకుండా సమావేశం నిర్వహిచటంతో…నిజంగానే ఏపీ బీజేపీ చీఫ్‌ మార్పు ఉంటుందని పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news