హార్దిక్‌ పాండ్య కి విరాట్ సపోర్ట్ చేసిన తీరు హ్యాట్సాఫ్- హర్భజన్ సింగ్

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్లో భాగంగా నిన్న రాత్రి ముంబై ఇండియన్స్ బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ బెంగళూరు జట్టుపై భారీ విజయాన్ని నమోదు చేసింది.197 పరుగుల భారీ లక్ష్యాన్ని 15.3 ఓవర్లలోనే ముంబై టీం ఛేదించింది.

ఇదిలా ఉంటే… ఈ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు కింగ్ విరాట్ కోహ్లి సపోర్ట్‌గా నిలవడంపై మాజీ క్రికెటర్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్ బాధ్యతలు అందుకున్న తర్వాత హార్దిక్‌ పాండ్య ప్రేక్షకుల నుంచి ఎగతాళికి గురవుతున్న విషయం తెలిసిందే. నిన్నటి మ్యాచ్లో హార్దిక్‌ను హేళను చేయొద్దని స్టేడియంలోని ప్రేక్షకులకు విరాట్ కోహ్లీ సూచించాడు. మద్దతు ఇవ్వాలని కోరాడు. ఆ తర్వాత హార్దిక్ హార్దిక్ అంటూ ఫ్యాన్స్ నినాదాలు చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక ఈ సంఘటనపై మాజీ క్రికెటర్ హార్బర్జన్ స్పందించాడు.హార్దిక్‌కు కోహ్లి అండగా నిలవడాన్ని మెచ్చుకున్నాడు. హార్దిక్ పాండ్యకు కోహ్లి సపోర్ట్ చేసిన విధానం, హేళన చేయొద్దని ప్రేక్షకులకు చెప్పడం, హార్దిక్‌కు మద్దతు ఇవ్వాలని కోరిన విధానం.. కోహ్లి గొప్ప ప్లేయర్, గొప్ప క్రీడాస్ఫూర్తి ఆటగాడు అని చెప్పడానికి సంకేతం” అని హర్భజన్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version