స్కిన్‌ గ్లోను పెంచే బాత్‌ సాల్ట్‌ గురించి విన్నారా.? ఏళ్ల నుంచి వస్తున్న ఆనవాయితీ !

-

స్నానం అలిసిపోయిన శరీరానికి తిరిగి ప్రాణం పోస్తుంది. ఎంత కష్టపడినా సరే ఇంటికొచ్చి ఫ్రెష్‌గా స్నానం చేస్తే ఆ మజనే వేరు. ఒత్తిడిని తగ్గిస్తుంది. స్నానం చేసేప్పుడు వాడే బాత్‌ సాల్ట్‌ గురించి మీకు తెలుసా..? దీని వల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా.!

 

బాత్ సాల్ట్స్ లాభాలు

బాత్‌ సాల్ట్స్‌ని ఉపయోగించే పద్ధతి ప్రపంచ వ్యాప్తంగా ఉంది. వీటిలో ఉండే మినరళ్ల వల్ల కండరాలకు హాయి చేకూరుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మీరు రోజూ ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతుంటే సాయంత్రం పూట బాత్‌ సాల్ట్స్‌ని ఉపయోగించి స్నానం చేయండి. స్పాలు, పెద్ద పెద్ద హోటళ్లలోనూ స్నానానికి ఈ ఉప్పుల్ని ఇస్తూ ఉంటారు.

కండరాలకు రిలాక్సేషన్‌ :

స్నానం చేసే బకెట్‌లో గాని, బాత్‌ టబ్‌లోగాని ఈ బాత్‌ సాల్ట్స్‌ని వేసుకుని స్నానం చేయండి. దీనివల్ల కండరాల వాపులు, నొప్పులు తగ్గుముఖం పడతాయి. ఎక్కువగా వ్యాయామాలు చేసేవారు, బెణుకులు, నొప్పులతో బాధ పడేవారు, అథ్లెట్లు దీన్ని వాడటం వల్ల ప్రయోజనం ఉంటుంది. కండరాలకు శ్వాంతన కలుగుతుంది.

చర్మానికి పునరుజ్జీవం :

సముద్రం నుంచి ప్రత్యేక పద్ధతుల ద్వారా వేరు చేసే ఈ బాత్‌ సాల్ట్స్‌లో ఎన్నో మినరళ్లు ఉంటాయి. ఇవి చర్మంలో తేమను తగినంతగా ఉంచేందుకు సహకరిస్తాయి. దీంతో అది సహజంగా బిగుతుగా, కాంతివంతంగా ఉంటుంది. చర్మంపై మృత కణాలన్నీ పోతాయి. తిరిగి కొత్త కణాలు ఏర్పడటాన్ని ఈ ఉప్పులు ప్రోత్సహిస్తాయి. మొత్తం శరీరపు చర్మం డిటాక్స్‌ అవుతుంది. దీని వల్ల పేరుకున్న విష పదార్థాలు అన్నీ తొలగిపోతాయి. స్కిన్‌ గ్లో పెరుగుతుంది. చర్మ సంబంధిత వ్యాధులతో బాధ పడే వారు కూడా వీటితో స్నానం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.

రక్త ప్రసరణ మెరుగవుతుంది :

మన శరీరానికి బ్లడ్ సర్క్యూలేషన్‌ చాలా ముఖ్యం. ఇది ఎంత ఎక్కువగా ఉంటే.. ఆ వ్యక్తి అంత యవ్వనంగా ఉంటాడు. ఆరోగ్యం కూడా బాగుంటుంది.
బాత్‌ సాల్ట్స్‌లో ఉండే మెగ్నీషియం వల్ల ప్రధానంగా శరీరంలో రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచడంలో సహకరిస్తుంది. రక్త ప్రసరణ సరిగ్గా జరగక పోవడం వల్ల వచ్చే దుష్ఫలితాల నుంచి రక్షిస్తుంది. తిమ్మిర్లు, వాపుల్లాంటివీ తగ్గుముఖం పడతాయి.

నిద్ర నాణ్యతను పెంచుతుంది :

బాత్‌ సాల్ట్స్‌ని ఉపయోగించి స్నానం చేయడం వల్ల శరీరానికి హాయిగా అనిపిస్తుంది. ఒత్తిడి, ఆందోళనల్లాంటివి తగ్గుముఖం పడతాయి. దీంతో నిద్ర బాగా పడుతుంది. నాణ్యమైన నిద్రను ఈ ఉప్పు ప్రోత్సహిస్తుంది. గాఢమైన నిద్రలో మన శరీరం ఎన్నో మరమ్మతులు చేసుకుంటుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version