SHOCKING :విజయ్ “లియో” డైరెక్టర్ కు గాయం…!

-

తమిళ స్టార్ హీరో విజయ్ జోసెఫ్ తలపతి నటించిన లేటెస్ట్ మూవీ “లియో”, రివ్యూలు పరంగా సాధారణ కథలా అనిపించినా వసూళ్ళలో అసాధారణంగా కలెక్ట్ చేస్తూ దసరా కు వచ్చిన మూడు సినిమాలలో రికార్డు స్థాయిలో దూసుకువెళుతోంది. ఇక ఈ సినిమాను డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కించారు. ఇందులో విజయ్ తో పాటు అర్జున్, సంజయ్ దత్ లాంటి స్టార్ నటులు నటించారు. ఈ సినిమాను మరింతగా ప్రమోషన్ చేయడానికి గాను లోకేష్ కానగరాజ్ కేరళ రాష్ట్రంలోని పాలక్కాడ్ లో ఆరోమా థియేటర్ కు వెళ్లగా… ఇతనిని చూడడానికి అభిమానులు భారీ స్థాయిలో రావడంతో అక్కడ చిన్నపాటి సంద్రమే ఏర్పడింది అని చెప్పాలి. ఈ జనసంద్రంకారణంగా తొక్కిసలాట జరగడంతో డైరెక్టర్ లోకేష్ కానగరాజ్ కాలికి గాయం అయింది.

ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా లోకేష్ తెలియచేస్తూ కేరళ ప్రజలు చూపించిన అభిమానానికి థాంక్స్ కాలికి గాయం అయిన కారణంగా పర్యటన కొనసాగించటం లేదు అంటూ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version