ఇజ్రాయెల్ కు మరియు పాలస్తీనాకు చెందిన హమాస్ మిలిటెంట్ లకు మధ్యన యుద్ధం జరుగుతున్న విషయం తెల్సిందే. మొదట్లో హమాస్ మిలిటెంట్ లు దాడి చేయగా కొన్ని రోజుల నుండి ఇజ్రాయెల్ సైనికులు గాజాపై దాడులు చేస్తోంది. ఈ దాడుల గురించి ప్రపంచం అంతా స్పందిస్తోంది… ఇజ్రాయెల్ ప్రధానిని కలిసి చాలా మంది వెంటనే దాడులు ఆపాలంటూ అడిగినా నెతన్యాహు ఆపడం లేదు . ఇక తాజాగా తెలంగాణ ఏ ఐ ఎం ఐ ఎం అదిఎంత అసదుద్దీన్ ఒవైసి ఆవేదనను తెలిపారు. అసదుద్దీన్ మాట్లాడుతూ ఇజ్రాయెల్ దాడులతో గాజాలోని ప్రజలు అని రకాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గర్భిణులు మరియు చిన్నపిల్లలకు వైద్య సహాయాలు అందించడానికి కనీస సౌకర్యాలు కూడా లేవంటూ బాధను తెలిపారు. వెంటనే నరేంద్ర మోదీ స్పందించి ఇజ్రాయెల్ దాడులను ఆపేలాగా చూస్తూ వారికీ సహాయక చర్యలు అందించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
మరి అసదుద్దీన్ చేసిన ఈ విజ్ఞప్తి పై ప్రధాని నరేంద్ర మోదీ ఏమైనా స్పందిస్తారా చూడాలి.