Viral Video: ‘చిక్నీ చమేలీ’ పాటకు విదేశీ అమ్మాయిల డ్యాన్స్ చూశారా?

-

భారత సినీ ఇండస్ట్రీలో పెను మార్పులు జరిగాయి. టాలీవుడ్, బాలీవుడ్, కోలివుడ్ అంటూ తేడా లేకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సోషల్ మీడియా వాడకం పెరిగింది. టిక్‌టాక్ వంటి షార్ట్ వీడియోలు బాగా పాపులర్ అయ్యాయి. రీల్స్ చేయడం వల్ల చాలా మంది సోషల్ మీడియా సెలబ్రిటీలుగా మారారు. దీంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు రీల్స్ చేస్తూ ఫేమస్ పాటలకు స్టెప్పులు వేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా బాలీవుడ్, టాలీవుడ్ పాటలకు క్రేజ్ పెరిగింది.

dance-viral-video
dance-viral-video

విదేశాల్లో నివసిస్తున్న భారతీయుల ద్వారా హిందీ పాటలు ప్రసిద్ధి చెందాయి. అలాగే విదేశీయులు కూడా ఎంతో ఉత్సాహంగా హిందీ పాటలకు డ్యాన్స్ చేస్తుంటారు. కత్రినా కైఫ్ నటించిన సూపర్‌హిట్ ఐటెం సాంగ్ ‘చిక్నీ చమేలీ’ సాంగ్ మీకు గుర్తుకు ఉండే ఉంటుంది. ఆ సాంగ్‌కు కత్రినా చేసిన డ్యాన్స్ నేటికీ యూత్‌ను ఉర్రూతలూగిస్తోంది. అయితే ఈ పాటపై ఓ విదేశీ యువతి చేసిన డ్యాన్స్ వీడియో బాగా వైరల్ అయింది. ఈ వీడియోలో ఒక విదేశీ అమ్మాయితోపాటు భారతీయ అమ్మాయి కూడా ఉంది. సహిరా తనేజా అనే యువతి తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. మీరు కూడా ఒకసారి వీడియోపై లుక్కేయండి.

https://www.instagram.com/p/CeqHHgHqyOK/?utm_source=ig_embed&utm_campaign=embed_video_watch_again

Read more RELATED
Recommended to you

Latest news