రసాబాసగా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీటింగ్..స్టేజ్ మీదనే తిట్లు !

-

ఉప్పల్ స్టేడియంలో హెచ్.సి.ఏ సర్వసభ్య సమావేశం రసాభాసగా సాగింది. స్టేజ్ పైనే కుమ్ములాటకి హెచ్.సి.ఏ. పాలకవర్గం దిగింది. సొంత ప్యానెల్ నుంచే హెచ్.సి.ఏ. అధ్యక్షుడు అజారుద్దీన్ కి వ్యతిరేకత వ్యక్తం అయింది. అధ్యక్షుడు అజార్ మాట హెచ్.సి.ఏ. క్లబ్ కార్యదర్శులు వినలేదు. వార్షిక సర్వసభ్య సమావేశం హాజరైన 186 మంది క్లబ్ సెక్రేటరీలు  హెచ్.సీ.ఏ.లో జరుగుతున్న అవినీతి, ప్లేయర్ల సెలక్షన్స్ పై వస్తున్న ఆరోపణలు, జిల్లాలలో క్రికెట్ అభివృద్ధి వంటి అంశాలపై అధ్యక్ష, కార్యదర్శులను ప్రశ్నించారు.

అంబుడ్స్ మెన్ నియామకంపై వివాదం మొదలయింది. దీపక్ వర్మ ను నియమించాలని  అజార్ పట్టుబడుతుండగా  అంబుడ్స్ మెన్ విషయంలో స్టేజి మీదనే ప్రెసిడెంట్ అజార్, సీక్రెటరీ విజయనంద్ తిట్టుకున్నారు. దీపక్ వర్మని అంబుడ్స్ మెన్ గా నియమించొద్దని సెక్రటరీ విజయనంద్ తో పాటు  క్లబ్ మెంబర్ల గొడవకు దిగారు. దీంతో అక్కడితో సమావేశాన్ని అర్ధంతరంగా ముగించారు. ఏప్రిల్ 11న మళ్ళీ సర్వ సభ్య సమావేశం జరగనుంది. 

Read more RELATED
Recommended to you

Latest news