ఆయనది గోల్డెన్ హార్ట్… ప్రశంసల వర్షం కురిపించిన కోలీవుడ్ నటుడు

-

రజనీకాంత్ సాయం వల్లే తన సతీమణిని కాపాడుకోగలిగానని తమిళ నటుడు లివింగ్టన్ అన్నారు. ‘ లాల్ సలామ్ సినిమాలో రజనీ కాంత్ కి స్నేహితుడిగా నటించాను. షూటింగ్ సమయంలో నా భార్య జెస్సీకి గుండెపోటు రావడంతో నా ఆర్థిక పరిస్థితి బాలేదు. అసిస్టెంట్ డైరెక్టర్ల ద్వారా విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ రజనీకాంత్ ఆపరేషన్ కోసం రూ.15లక్షల సాయం చేశారు. ఆయనది గోల్డెన్ హార్ట్. ఆపదల్లో ఉన్న ఎందరినో సార్ ఆదుకున్నారు’ అని ప్రశంసల వర్షం కురిపించారు.

కాగా,తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తన కూతురు ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో తాజాగా నటించిన చిత్రం లాల్ సలాం. ఈ సినిమా ఫిబ్రవరి 9న ప్రేక్షకులకు ముందుకు వచ్చింది.ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ సినిమాకి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ అతిథి పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పై సుభాస్కరన్ నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news