ప్రభుత్వానికి…. మరో 4 రోజులే గడువు: ఎంపీ బండి సంజయ్

-

మరో నాలుగు రోజుల్లో దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్కు చిత్తశుద్ధి ఉంటే ఇచ్చిన హామీలను అమలు చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.మల్యాలలో ప్రజాహిత యాత్రలో పాల్గొన్నా బండి సంజయ్ మాట్లాడుతూ….కోటిన్నర మంది మహిళల ఖాతాల్లో రూ.2500 జమ చేయాలన్నారు. 50 లక్షల మందికి రూ.15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15 లక్షల మంది కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు. ఇళ్లు లేని 25 లక్షల మందికి స్థిరనివాసం ఏర్పరచుకునేందుకు సాయం చేయాలని సూచించారు. ఇక ఆరు గ్యారంటీల అమలుకు 4 రోజులే గడువన్నారు.

ఈ క్రమంలోనే ఎమ్మెల్యే కేటీఆర్ పై బండి సంజయ్ విరుచుకుపడ్డారు.కేటీఆర్ కండకావరమెక్కి మాట్లాడుతున్నాడు అని..పార్లమెంట్ రికార్డులు చూసుకో..నేను సమావేశాలకు వెళ్లానో లేదో తెలుస్తుందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చీపురుతో బీఆర్ ఎస్ ను ఊడ్చేసినా సిగ్గే లేకుండా కదనభేరి నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కొండగట్టు,వేములవాడ, ధర్మపురి ఆలయాలకు బీఆర్ ఎస్ ప్రభుత్వం హామీలిచ్చి నెరవేర్చలేదని బండిసంజయ్ అన్నారు. బీజేపీ ఎంపీలు గెలిస్తేనే పంచాయతీలకు నిధులోస్తాయన్నారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news