తాను రచయితను కాదు.. తనకు రచనలు రావు అని మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యా సాగర్ రావు తెలిపారు. తాను సంవత్సరం పాటు జైల్లో ఉండి రచనలు రాశానని గుర్తు చేసుకున్నారు. విద్యాసాగర్ రావు రాసిన ఉనిక పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. తాను గవర్నర్ గా ఉన్నప్పుడు ఉనిక పుస్తకాన్ని రాశానని వెల్లడించారు. గవర్నర్ గా తన అనుభవాలతో ఉనిక పేరుతో పుస్తకం వచ్చిందన్నారు. ఆర్ఎస్ఎస్ నుంచి గవర్నర్ వరకు తన అనుభవాలతో పుస్తకం ఉందని వివరించారు.
ఈ వేదిక పై మూడు రంగులు కనపడుతున్నాయని.. దీనికి కారణం సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను గవర్నర్ గా ఉన్నప్పుడు ముగ్గురు ముఖ్యమంత్రులు తన కోసం వేచి చూశారని గుర్తు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డిని నేను రిసీవ్ చేసుకున్నానని చెప్పారు. హైడ్రా తీసుకురావడం అభినందనీయమని కొనియాడారు. హైడ్రా మంచిదే.. మూసీ పునరుజ్జీవనం హైదరాబాద్ కు మంచి చేస్తుందని అన్నారు. కోనేరు రంగారావు రిపోర్టును అమలు చేయాలన్నారు. ఆదివాసీ భూములు వారికి చెందేేవిధంగా చేస్తే మీ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని సూచించారు చెన్నమనేని విద్యాసాగర్ రావు.